జై భవాని జై జై భవాని
జై భవాని జై జై భవాని
నీలవేణి కరునించవేమి. (2)
అమ్మ రావే దుర్గ భవాని
తల్లి నీవే శాంకరీ... శ్రీవాణి. (2)
కృష్ణవేణీ తీరాన ఇంద్రకీల పర్వతాన. (2)
వెలిసినావే దుర్గమ్మ వ్యధలు తీర్చరావమ్మ. (2)
సురాసురుల కన్న తల్లి, సుందర రూపిని దేవి,
జగాలేలే మాయమ్మ, జగన్మాత నీవమ్మ..... (జై భవాని)
ఆది పరాశక్తి నేవే, అన్నపూర్ణ తల్లి నేవే (2)
అష్ట దశ పీఠాలను అధిష్టించు అమ్మ నేవే (2)
బొంబాయి అమ్మవు నీవు, కలకత్తా కాళి నీవు
మదురై మీనాక్షి నీవు - కంచి లో కామాక్షి వి నీవు. (జై భవాని)
మమ్ముల గన్న మాయమ్మ, మము బ్రోవ రావమ్మా. (2)
అంబ జగదాంబ మాత, అభయ నిలయ నీవమ్మా. (2)
అయిగిరి నందిని మాత, అష్టాదశల దుర్గ మాత
కరుణించే కాళీమాత - కనక దుర్గ నేవమ్మ. (జై భవాని)