అయ్యా రా... రా రా రా రా
"స్వామీ రా "
మణిమాలా ధారుడా మహినేలే దేవుడానీ భక్తుల బ్రోవగా కొండ దిగి రావయ్యా
" స్వామి రా "
శబరి మలై కొండల్లో కొలువై ఉన్నావంటానీలి మలై నీడల్లో నిలిచి ఉన్నావంటా
పంపా నది తీరాన పవళించి ఉన్నావంటా
పందల రాజయ్య చెంత చేర రావయ్యా
"స్వామి రా "
కాషాయం కట్టినోల్లు కఠిన దీక్షలున్నారునీలి వస్త్ర మేసినోల్లు నియమంతో ఉన్నారు
నల్ల బట్టలేసినోల్లు నిన్నే నమ్ముకున్నారు
పందళ రాజువయ్య మా అండగా నువ్వు రావయ్యా
" స్వామి రా "
ప్రకృతంతా నీ కోసం పులకరించి పోయింది
పున్నాగలు విరి మల్లెలు కాచి విరగ బూచాయి
నీ మేడలో ఉండాలని నీ సేవలే పొందాలని
కొండంత ఆశతో దండగా మారింది
స్పటిక బెల్లం పాయసాలు పాలు పళ్ళు తెచ్చాము
కస్తూరి గంధాలు అరగ దీసుకోచ్చాము
అయ్యా ఓరయ్యా మా పూజలందు కోవయ్య
పున్నాగలు విరి మల్లెలు కాచి విరగ బూచాయి
నీ మేడలో ఉండాలని నీ సేవలే పొందాలని
కొండంత ఆశతో దండగా మారింది
" స్వామీ రా "
పన్నీరు చిలకరించి పూ మాలలు కట్టాముస్పటిక బెల్లం పాయసాలు పాలు పళ్ళు తెచ్చాము
కస్తూరి గంధాలు అరగ దీసుకోచ్చాము
అయ్యా ఓరయ్యా మా పూజలందు కోవయ్య
" స్వామి రా "
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
