Namo Sambasivaa Lyrics || నమో సాంబశివా – హరహర లిరిక్స్ – శివాయ భజన పాట


నమో సాంబశివా – హరహర
నమో పార్వతీశా – హరహర
నమో పార్వతీశా

నమో సాంబశివా – హరహర
నమో పార్వతీశా – హరహర

1. సహస్ర కోటి సూర్యప్రకాశ
ముజ్జగములకు ఈశా మహేశా
దేవాసురలు మధనము చేయగ
జగతి దహించెడి గరళము నిలిపి

నమో సాంబశివా – హరహర
నమో పార్వతీశా – హరహర

2. పాశుపతంబును పార్ధుడు కోరగ
ఫల్గుణ శక్తిని పరిశీలించగ
కిరాత రూపుని కిరీటి తోడు
పోరు సల్పిన ఈశా మహేశా

నమో సాంబశివా – హరహర
నమో పార్వతీశా – హరహర

3. కైలాసములో కొలువు తీరగా
నాగులు మెడలో నాట్యమాడగా
ఘనముని గణములు శంఖములూదగా
తాండవ మాడిన తాలడవ ఈశా మహేశా

నమో సాంబశివా – హరహర
నమో పార్వతీశా – హరహర

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!