కార్తీక మాసంలో శివదేవుని సన్నిధిలో
కొలచెదము నిను తలచెదము
మము చల్లగ చూడుము ఓ శంకర
"కార్తీక మాసంలో"
గంగా నది స్నానము చేసి చేరెదము నీ సన్నిధికి
విభూది నామము దిద్ది చేసేదము నీ పూజలనే
నీవే మాపాలి ధైవమని
నీవే మమ్మలు స్వామివని
కొలచెదము నిను తలచెదము
మము చల్లగ చూడుము గంగదరా
"కార్తీక మాసంలో"
సోమవార వ్రతములు చేసి చేసేదము నీ పూజలనే
నియమ నిష్టాలతోడ పాడెదము నీ కీర్తనలే
నీవే మాపాలి దైవమని
నీవే మా ఇల వేలుపనీ!
కొలచెదము నిను తలచెదము
మము చల్లగ చూడుము ఓ శంకరా
"కార్తీక మాసంలో"
మెడలోన నాగరాజు ఆడుచుండు ఆనందముగా
శిగలోన నెలవంక వెలుగుచుండు ముల్లోకాలు.
నీవే మాపాలి దైవమని
నీవే మముగబ్రోచు స్వామివని.
కొలచెదము నిను తలచెదము
మము చల్లగ చూడుము ఓ శంకరా