ఓ కైలాసహిమగిరి శంకరా...
కనికరం ఉంచరా, మనసార మోము చూపించరా
|| ఓ ||
నీలకంఠా నిను చూడగోరి నిరతము నిను ప్రార్ధించితి
జగతినేతా జాగేల మాపై.... జ్యోతులివిగో జగమేలరా
కనికరం ఉంచరా, మనసార మోము చూపించరా
చంద్రమౌళీ చితభస్మధారీ చంద్రకిరణాల తేజోవిహారీ
దండమోయి ఓ లింగధారీ... నిండుగొలిపే చర్మాంబరీ
కనికరం ఉంచరా, మనసార మోము చూపించరా
మనసు నిలిపిన మహనీయులందరు జన్మ సద్గతి కావించిరి కానరాని కలిమాయలోన... కారడవిలో పడియుంటిరా
కనికరం ఉంచరా, మనసారా మోము చూపించరా