రావి చెట్టు ముందు దీపం పెడుతున్నారా…అయితే ఈ తప్పులు చేయకండి!
సనాతన ధర్మంలో దేవతల ఆరాధనతో పాటు ప్రకృతి ఆరాధన కూడా ముఖ్యమైనది. ప్రకృతిలో అనేక మొక్కలు, చెట్లు ఉన్నాయి. వాటిని భగవంతుని రూపాలుగా పూజిస్తారు. అలాంటి పవిత్ర వృక్షాలలో రావిచెట్టు కూడా ఒకటిగా చెప్పవచ్చు. రావి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారని సకల శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు రావి ఆకుల్లో కాస్మిక్ శక్తి ఉంటుందని సైన్స్ కూడా చెబుతోంది. రావి చెట్టు అత్యధిక ఆక్సిజన్ అందించే వృక్షమని, కాలుష్యాన్ని సైతం తీసుకొని ఈ చెట్టు ప్రకృతికి అవసరం అయిన ఆక్సిజన్ అందిస్తుందని ఇటీవల శాస్త్రవేత్తలు తేల్చారు. ఇక మత విశ్వాసాల ప్రకారం, నిజమైన భక్తితో రావి చెట్టును పూజించి, దీపం వెలిగించిన భక్తులు తమ జీవితంలోని అన్ని కష్టాల నుంచి బయటపడతారు. అయితే రావి చెట్టు కింద దీపం వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. మత విశ్వాసాల ప్రకారం, ఆ నియమాలను పాటించాలి. లేకుంటే కొన్ని విపత్కర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ నియమాలు ఏమిటో తెలుసుకుందాం.
రావిచెట్టు కింద దీపాలు వెలిగించాలంటే నియమాలు ఇవే:
దీపం వెలిగించే సమయం:
వైదిక శాస్త్రం ప్రకారం, ఉదయం , సాయంత్రం రావిచెట్టు కింద దీపం వెలిగించడం శ్రేయస్కరం. శాస్త్ర ప్రకారం, ఎవరైతే ఈ ప్రత్యేక సందర్భంలో రావి చెట్టుకు 7 సార్లు ప్రదక్షిణలు చేసి దీపం వెలిగిస్తారో, వారి ఇల్లు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుంది. శనిదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది.
- శాస్త్రాల ప్రకారం, ఉదయం , సాయంత్రం రావి చెట్టు ముందు దీపం వెలిగించడం మాత్రమే శ్రేయస్కరం. అయితే, దీపం వెలిగించడానికి రాత్రి సమయం అశుభంగా పరిగణిస్తారు. అందుచేత రాత్రి పూట రావిచెట్టు ముందు దీపం వెలిగించకండి. ఈ కాలంలో దీపం వెలిగించడం వల్ల దుష్ఫలితాలు ఉంటాయి. కాబట్టి రాత్రిపూట దీపం వెలిగించడం మానుకోవాలని పండితులు చెబుతున్నారు.
ఆవ నూనె దీపం:
రావిచెట్టు ముందు దీపం వెలిగించేటప్పుడు, ఈ ప్రదేశంలో ఆవనూనె దీపం మాత్రమే వెలిగించాలని గుర్తుంచుకోండి. పూజా పరమైన కార్యక్రమాలలో ఆవనూనె అత్యంత సముచితంగా పరిగణించబడుతుంది.
దీపాలు వెలిగించడానికి ఇవి అనుకూలమైన రోజులు:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గురువారం , శనివారాలు రావి చెట్టు ముందు దీపం వెలిగించడానికి అనుకూలమైన రోజులు. కాబట్టి ఆదివారం రావిచెట్టు కిందకు వెళ్లడం మానుకోండి.