రామ మందిరం అయోధ్య రామ మందిరం
రామ మందిరం సుందర రామ మందిరం
తరతరాలు కలలుగన్న సుందర స్వప్నం
భరత జాతి సంకేతం అవనికే ఆదర్శం.
దశరథ సుతుడై శ్రీహరి అవతరించినా క్షేత్రం
సప్త ఋషులు నడయాడిన నందన వనమీ క్షేత్రం
పరమ పతీవ్రత సీతాదేవి పరవశించినా క్షేత్రం
పవనసుతుడు హనుమంతుడు ప్రణమిల్లిన శుభ క్షేత్రం.
కరసేవకులర్పించిన ప్రాణాలకు త్యాగఫలం
విశ్వహిందూ జనావళికి అశ్వమేధ యాగఫలం
రామరాజ్య స్థాపనకై వచ్చెను శుభ తరుణం
సర్వ మానవాళికిదే నిజమైన పర్వదినం.