ఆంజనేయా అంజనితనయా
వానరవీరా శ్రీఆంజనేయా
కొలిచితివయ్యా నీ హృదియందే
రఘురాముని కొలువుగచేసి
రామరామ అను నామస్మరణ
నీ అణువణువున నిండెను నిరతం
అంకితమాయెను నీ జీవితమే
రాముని సన్నిధి రాగాల స్వరమై
శ్రీశుభ చరణా శోభితవదనా
మము దయగనుమా మా దేవదేవా
కరుణను చూపి కాపాడుమయ్యా
ఆశ్రితవదనా ఓ వాయుపుత్రా
భజియించెదము నీ నామమయ్యా
మము దయగనుమా మంగళమూర్తి
ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయ పాహిమాం
రామచంద్ర మునసది ఆంజనేయ రక్షమాం