పల్లవి:-) నిను మరవలేను తండ్రి నిను మరవలేను
నిమిషమైన నిన్ను నేను చూడకుండలేను
నను నేను మరచినాను నిన్నే తలచినాను
తనువందు నిన్ను నిలిపి శరణు పలికినాను
అను:-) ఈ జీవం నీ సర్వం
ఏ జన్మల నా పుణ్యం (2)
' అయ్యప్ప నీనామం , అది నాకు గొప్పవరం...!
చ:-1) ఒకానొకానాడు నాకు
స్వామి కలలకొచ్చినాడు
చిరునవ్వుల తేజముతోను
నన్ను తట్టిలేపినాడు
ఉలికిపడి లేచినాను
కంటతడి నే పెట్టాను
అను:-) కనిపించని ఏదో శక్తి
నను కలవరపెట్టెను భక్తి
'నా కంటికి అది ఒక ప్రాప్తి , అయ్యప్ప ఇయ్యవా ముక్తి
చ:-2) స్వామి భజన చేస్తూవుంటే
ఏదో తెలియని ఆనందం
నా పక్కన కూర్చున్నట్టే
మనసుకు కలిగే సంతోషం
' పరవశించి పోతినేను పరితపించి వేడినాను '
అను:-) తరతరాల చెరగని బందం
ఈ భక్తునికెంతటి భాగ్యం
' మరవబోదు నాప్రాణం , అయ్యప్ప నీ రూపం...!
చ:-3) నాటి నుంచి నేటి వరకు
నా గానమే నీ కొరకు
నా కంఠ ఊపిరి బతుకు
ఉన్నది నీ సేవ కొరకు
' ఉట్టి మాట కాదు స్వామి
ఒట్టు వేస్తున్నా స్వామి '
అను:-) మట్టిలోనా కలిసే దాకా
మరవలేను అయ్యప్ప మాలా
నీ చల్లని పాదం నీడా ఉండాలి అయ్యప్ప దేవా..
పల్లవి:-) నిను మరవలేను తండ్రి నిను మరవలేను
నిమిషమైన నిన్ను నేను చూడకుండలేను
నను నేను మరచినాను నిన్నే తలచినాను
తనువందు నిన్ను నిలిపి శరణు పలికినాను
అను:-) ఈ జీవం నీ సర్వం
ఏ జన్మల నా పుణ్యం (2)
' అయ్యప్ప నీనామం , అది నాకు గొప్పవరం...!