రంగైన రతనాల / Rangaina Rathanala - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

రంగైన రతనాల 

పల్లవి: రంగైనా రతనాల అందమైన శబరిమల
మము దయతో చూడగరావయ్యా శబరిగిరీ అయ్యప్పా
                                                          ||రంగైనా||


నీవుండేది శబరిమలా! మేముండేది పాలమూరు
మము దయతో చూడగరావయ్యా శబరిగిరీ అయ్యప్పా
                                                       ||రంగైనా||


నీ తల్లీ మోహిని నీ తండ్రీ హరిహరుడు
మము దయతో చూడగరావయ్యా శబరిగిరీ అయ్యప్పా
                                                       రంగైనా||


కార్తీక మాసాన మళాలే వేసితిమి
మండలాకాలంలో దీక్షాలే చేసితిమి
మము దయతో చూడగరావయ్యా శబరిగిరీ అయ్యప్పా
                                                      ||రంగైనా||


ఇరుముడులూ కట్టుకోని నెత్తిమీద పెట్టుకోని
మేము గురుస్వామూల వెంబడీ వస్తున్నాము అయ్యప్పా
మము దయతో చూడగరావయ్యా శబరిగిరీ అయ్యప్పా
                                                       ||రంగైనా

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!