అఖిలాండేశ్వరివే - శ్రీ చాముండేశ్వరివే - అమ్మవారి భజన పాటల లిరిక్స్

P Madhav Kumar


అఖిలాండేశ్వరివే - శ్రీ చాముండేశ్వరివే
ఆదిపరాశక్తివే- మా కనకదుర్గాంబికవే. అమ్మా ....    

|| అఖి ||

సిరిగల తల్లివి నీవమ్మా - సుందర రూపము నీదమ్మా
వరముల నీయగ రావమ్మా - నిరతము నిను కొలిచెదమమ్మా    

|| అఖి ||

పూజకు పూలను తెచ్చాము - పసుపు కుంకుమలిచ్చాము
పరమేశ్వరి నీ దరి చేరి- జయము నిమ్మని కోరాము   

|| అఖి ||

మహిషాసుర సంహారిణివి - సింహ వాహినివి నీవమ్మా
మహినే ఏలగ రావమ్మా - అంబ భవాని దుర్గమ్మా   

|| అఖి ||

నీ గుడిలోన దివ్వెలము - నీ పదములపై పువ్వులము
నిను నమ్మిన నిరు పేదలము-మా జీవితమే నీకంకితము   

|| అఖి ||


శివ మహారాణివి నీవమ్మా - చిరునవ్వుల మా గౌరమ్మా
శరణముకోరితి నీయమ్మా- అప్పన్న దాసుని గనుమమ్మా  

|| అఖి ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat