నువ్వె నా గానమయ్యా నువ్వె నా ప్రాణమయ్యా
నీదయ ఉంటే చాలయ్యా ఓ అంజన్న స్వామి
జన్మంతా నీసేవ సేతునయ్యా ఓ అంజన్న స్వామి.
జన్మంతా నీ సేవ సేతునయ్యా
"నువ్వె నా గానమయ్యా"
నా గుండె కోవెలచేసి నిన్ను కొలువుంచానయ్యా
నా కన్నులు జ్యోతులు చేసి నీకు వెలిగించానయ్యా
నా మనస్సే హారతినిచ్చాను.ఓ అంజన్న స్వామి
నాలోనే నిను చూసుకొన్నాను
"నువ్వె నా గానమయ్యా"
నోరార నీ గాణాన్నే మనసారా పాడేదనయ్యా
పాటల మాలలల్లీ నీకే అర్పింతునయ్యా
రాగాల పల్లకిలోనా ఓ అంజన్న స్వామి
నిన్ను నే ఊరేగింతునయ్యా ఓ అంజన్న స్వామి
"నువ్వె నా గానమయ్యా"
రతనాల కాంతికంటే రమణీయ రూపుడనీవే
ముత్యాల మొరుగుకంటే ముద్దుల స్వామివి నీవే
ఒక్కసారి నిన్నే చూసినా ఓ అంజన్న స్వామి
లెక్కలేని భాదలు తొలుగునయ్యా ఓ అంజన్న స్వామి
"నువ్వె నా గానమయ్యా