అదిగదిగో పళణిమలా అయ్యప్ప సోదరుడు ఉన్నమలా
శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్పస్వామియే
స్వామియే అయ్యపా - అయ్యప్పా స్వామియె
అదిగదిగో శబరిమల - శివకేశవులు ఉన్నమల
ఉన్నవారిని లేనివారిని తేడలేనిది శబరిమల
కులమొ మతమొ, జాతి భేదము తేడలేనిది శబరిమల
||శరణమయ్యప్ప]
అదిగదిగో పళనిమల శివపార్వతుల ఉన్నమలకైలాసం వైకుంఠం కలసిఉన్నది శబరిమల
ఈశ్వర హృదయం మాధవనిలయం కలిసిఉన్నది శబరిమల
||శరణమయ్యప్ప||
అదిగదిగో పంపానది, దక్షిణభారత గంగానదిఈశ్వర కేశవ నందునందుని పాదముకడిగిన పుణ్యనది
అదిగదిగో శబరి పీఠం భక్తజనులకిది ముక్తిపీఠం
శబరి ఎంగిలి ఆరగించిన రాముడు నడిచిన పుణ్యస్థలం
అదిగదిగో కాంతమల అక్కడ వెలువడును మకరజ్యోతి
హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామికి హారతి ఇచ్చేదీపమది
||శరణమయ్యప్ప||
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
