కన్నెస్వాములు వచ్చారు / Kanne swamulu vacharu - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

కన్నెస్వాములు వచ్చారు గురు స్వాములు వచ్చారు
మణికంఠ లు వచ్చారు మాలికాంబలు వచ్చారు
యాడ దాగి ఉన్నావ్ అయ్యో అయ్యప్ప స్వామి
జాడ గాన రదేమయ్యో అయ్యప్ప స్వామి



మెట్టు మెట్టు ఎక్కుకుంటూ శరణాలు చెప్పుకుంటూ
 నీ కొండకు వచ్చా మయ్యో...... అయ్యప్ప స్వామి
 జాడ గాన రదేమయ్యో అయ్యప్ప స్వామి.



చెట్టు చెట్టు తిరిగి తిరిగి రకరకాల పూలు తెచ్చి
మాలలే వేసమయ్యో అయ్యప్ప స్వామి
జాడ గాన రదేమయ్యో అయ్యప్ప స్వామి



మీ కొండకు రాలేని ఆడపడుచులు అంతా కలిసి
నీ పూజ ఉందని ఇక్కడికి వచ్చినారు
వాళ్ల మీద దయ చూపయ్యో అప్ప స్వామి
మా మీద దయ చూపయ్యో అయ్యప్ప స్వామి



పందిళ్ళు వేసినాము తోరణాలు కట్టి నాము
రకరకాల నైవేద్యములు ఆరగింపు పెట్టినాము
ఆరగించి పోవే మయ్య అయ్యప్పస్వామి
జాడ కాన రాదేమయ్యా అయ్యప్ప స్వామి

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!