తులసీ దళాలతో / Tulasi dalalato l అయ్యప్ప భజన పాటల లిరిక్స్


తులసీ దళాలతో తుల తూచుదామంటే  ||2||

రుక్మిణమ్మను నేను కానయ అయ్యప్పా 

అంత భక్తి నాకు లేదయా

||తులసి దళాలతో||

ఏటేటా నీ కొరకు ఎదురు చూచుదమంటే  ||2||

మంజుమాతను నేను కానయా అయ్యప్పా అంత ప్రేమ నాకు లేదయా  ||2||

||తులసి దళాలతో||


జగమెల్ల నీ గుడులు నేనే నిర్మిద్దమంటే  ||2||

రామదాసును నేను కానయా అయ్యప్ప 

అంత ధనము నాకు లేదయా || 2||

||తులసి దళాలతో||


వేల వేల కీర్తనలు నీకై రచిఇద్దుమ్మంటే   ||2||

అన్నమయ్యను నేను కానయా అయ్యప్ప

కారణాజన్ముని కానయా  ||2||

||తులసి దళాలతో||



మధురంగా నీ పాటలు నేనే పాడుదమంటే ||2||

జేసుదాసును నేను కానయా అయ్యప్పా

అంత గళము నాకు లేదయా  ||2||

||తులసి దళాలతో||


మెల్ తాంత్రి పూజలను నేనే  చేయుదమంటే ||2||

కేరళలో పుట్టలేదయా అయ్యప్ప

మలయాళం నాకు రాదయా   ||2||

||తులసి దళాలతో||


ఎంతో వైభోగంగా పడి పూజను చేద్దమంటే  ||2||

జనార్ధన్ గురు స్వామిని కానయా అయ్యప్ప

అంత శక్తి నాకు లేదయా || 2||



||తులసి దళాలతో






#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!