కంచిలో కామాక్షివే ... మధురలో మీనాక్షివే అమ్మలగన్నఅమ్మవే ... నువ్వాది పరాశక్తివే
*పల్లవి :*
కామాక్షి మీనాక్షి శరణమమ్మ తల్లీ
నువ్ ఆది పరాశక్తివే శరణమమ్మా తల్లీ ||2||
*చరణం : 1*
శృంగేరి శారదాంబ మైసూరు చాముండి ||2||
విజయవాడ కనకదుర్గవే మాయమ్మ తల్లి కలకత్తా కాళిమాతవే ||2||
॥ కామాక్షి మీనాక్షి ॥
*చరణం : 2*
నందనవరం చౌడమ్మా ఆలంపురం జోగులాంబ ||2||
శ్రీశైలం భ్రమరాంబవే మాయమ్మ తల్లి కాశి అన్నపూర్ణేశ్వరివే ||2||
॥ కామాక్షి మీనాక్షి ॥
*చరణం : 3*
సమయపురం మారియమ్మ కన్యాకుమారియమ్మా ||2||
శబరిమలై మంజుమాతవే మాయమ్మ తల్లి బాసరలో చదువలమ్మవే ||2||
॥ కామాక్షి మీనాక్షి ॥
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
లిరిక్స్ పంపినవారు :
*వై. వెంకటసుబ్బారెడ్డి స్వామి*