చేతులెత్తి చెంత నిలిచి వేడుకొందు స్వామి - అయ్యప్ప భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

చేతులెత్తి చెంత నిలిచి వేడుకొందు స్వామి - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar


చేతులెత్తి చెంత నిలిచి వేడుకొందు స్వామి
దేవుడని కొలుచుకొని మొక్కుకొందు స్వామి

అయ్యప్ప స్వామి... అద్భుత స్వామీ

*** ***

స్వర్గలోక దేవతలకు వరములిచ్చు స్వామి
క్రూరమైన దానవులను కూల్చివేయు స్వామి
అయ్యప్ప స్వామి... అద్భుత స్వామి..
  ​

ఇల యందు రామకృష్ణ లీలలు నీవే
నన్ను కాపాడు పరమశివుడు విష్ణువు నీవే
ఇల యందు రామకృష్ణ లీలలు నీవే
నన్ను కాపాడు పరమశివుడు విష్ణువు నీవే
సకలమును ఏలుచుండు శక్తివి నీవే
నిను నమ్ము వారి ఆవేదన చూడవిదేలా
అయ్యప్ప స్వామి... నీవే అద్భుత స్వామి


చేతులెత్తి చెంత నిలిచి వేడుకొందు స్వామి
దేవుడని కొలుచుకొని మొక్కుకొందు స్వామి
అయ్యప్ప స్వామి... అద్భుత స్వామి

  ​

అక్క ఉంది చెల్లెలుంది ఆడిపాడగా
ఒక తమ్ముని మాకు ప్రసాదించు వంశమందున
అక్క ఉంది చెల్లెలుంది ఆడిపాడగా
ఒక తమ్ముని మాకు ప్రసాదించు వంశమందున
నడువలేని నాన్న నిన్ను చూడవచ్చినా
అతడు తోడు వచ్చి పొందు సుమా నీదు దీవెనా
అయ్యప్ప స్వామి నీవే అద్భుత స్వామి

చేతులెత్తి చెంత నిలిచి వేడుకొందు స్వామి
దేవుడని కొలుచుకొని మొక్కుకొందు స్వామి
అయ్యప్ప స్వామి... అద్భుత స్వామీ



చిత్రం : అయ్యప్ప స్వామి (1975)
సంగీతం : జి.దేవరాజన్
గీతరచయిత : అనిశెట్టి
గానం : సుశీల


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow