ఏమి శంకరా నీదు మహిమ ఏమి శంకరా | శివ భజన పాటల లిరిక్స్

 ఏమి శంకరా నీదు మహిమ ఏమి శంకరా | 

ఎవ్వరీకి తెలియదాయె ఏమి శంకరా  ఏమి| 

పాలు కలిపిన పంచామృతము ఎంగిలంటివీ - శంకరా ॥ఏమి ॥


గంగజలము తెచ్చినీకు అభిషేకం చేతమంటే 

గంగలో నున్న కప్ప, చేపల ఎంగిలంటివీ శంకరా  ॥ ఏమి ॥


ఆవు పాలు తెచ్చినీకు అభిషేకం చేతమంటే 

చిన్ని చిన్ని లేగదూడల ఎంగిలంటివీ శంకరా  ॥ ఏమి ॥


పండ్లు ఫలములు తెచ్చినీకు నైవేద్యం చేతమంటే 

చిన్ని చిన్ని రామచిలుకల ఎంగిలంటివీ - శంకరా  ॥ ఏమి ॥


తుమ్మి పూలు తెచ్చినీకు తృప్తిగా పూజింతమంటే 

కొమ్మకొమ్మకు కోటితుమ్మెదల ఎంగిలంటివీ - శంకరా ॥ ఏమి ॥


నారికేళము తెచ్చినీకు నైవేద్యం పెడదమంటే 

అప్పుడైనా నీవు నన్ను ఒప్పుకొందువా - శంకరా  ॥ ఏమి ॥

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!