పువ్వులార అయ్యప్పస్వామి పూజకు వస్తరా - అయ్యప్ప భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

పువ్వులార అయ్యప్పస్వామి పూజకు వస్తరా - అయ్యప్ప భజన పాటల లిరిక్స్


పువ్వులార అయ్యప్పస్వామి పూజకు వస్తరా
పూజకు వచ్చి స్వామిని మెచ్చి మీరు చూస్తరా
స్వామి కొరకు తోటలో రోజూ విరబూస్తరా
స్వామికి పూదండగ కోవెలకు వస్తరా

పూర్వజన్మ పుణ్యమో పువ్వులుగా పుట్టితిరీ
సర్వదేవతలకు మీరు మెదలోన మెట్టితిరీ
మేము కూడ పువ్వులమైతె ఎంతో బాగుండేదీ
మలయాల మణికంఠుని మందిర మేగి ఉండేది

రకరకాల పువ్వులతో రంగు రంగుల పూలతో
అంగరంగ వైభవంగ పూల హార మల్లికతో
స్వామి మెడన వేస్తరూ స్వాములంత చూస్తరూ
స్వామితో పాటు మీకు సరిగదండం చేస్తారూ

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow