Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

జై భవాణి శ్రీ భవాణి మా భవాణివే - అమ్మవారి భజన పాటల లిరిక్స్


జై భవాణి శ్రీ భవాణి మా భవాణివే శరణు తల్లి కరుణనేలు మా భవాణివే 

॥జై భవాణి॥

వెండి కొండపైన తల్లి వెలుగుతుంటివే పరమశివుని దేవేరిగా మెరయుచుంటివే 

॥జై భవాణి॥

శరణుకోరి నిలిచెనమ్మ అఖిల జగములే పాహిపాహి అనెను తల్లి నిఖిల భువనమే 

॥జై భవాణి॥

అవనిలోన భక్త జనుల కల్పవల్లివే అభయమిచ్చి కాపాడే జగన్మాతవే 

॥జై భవాణి॥

కోరి కొలిచి నంత వరములిచ్చు తల్లివే అండ నుండి దయను చూపి దయను యేలవే 

॥జై భవాణి॥

దోసిలోగ్గి వేడుకుంటినమ్మ శాంభవి కరుణ జూపి కావుమమ్మ చిద్విలాసిని 

॥జై భవాణి॥

జనని మాత వేదమాత విశ్వరూపిణి సురమి నినుగన సేవిత దుర్గా భవాణివే 

॥జై భవాణి॥

మదిని తలచి భజన చేతు మమ్మపావని సకల లోక పాలిటి ఆనంద రూపిణి

॥జై భవాణి॥


ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.

లిరిక్స్ పంపినవారు : 

*వై. వెంకటసుబ్బారెడ్డి స్వామి*

📢 Follow