మొదటిరోజు
ఈ రోజు అమ్మవారిని శ్రీ స్వర్ణకవచాలంకరణ దుర్గాదేవిగా దర్శనమిస్తుంది.
ఈ రోజున అమ్మవారిని ఎరుపు రంగు వస్త్రంతో అలంకరిస్తారు.
అమ్మవారికి పొంగలి నైవేద్యం
రెండవరోజు
ఈ రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అంటే బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది.
రోజు బంగారు వర్ణ (పసుపు రంగు) వస్త్రంతో అలంకరిస్తారు.
నైవేద్యంగా పులిహోర సమర్పిస్తారు.
మూడవరోజు
ఈరోజు అమ్మవారిని గాయత్రీదేవి రూపంలో అలంకరిస్తారు.
ఈ రోజు అమ్మవారిని పసుపు రంగు వస్త్రంతో అలంకరిస్తారు.
నైవేద్యంగా కొబ్బరి అన్నం, పాయసం సమర్పించుకుంటారు..
నాలుగవ రోజ
ఈరోజు అమ్మవారిని అన్నపూర్ణదేవిగా అలంకరిస్తారు.
ఈరోజు అమ్మవారికి లేత గంధం రంగు చీరను కట్టి అలంకరిస్తారు..
నైవేద్యంగా మినపగారెలు, మొక్కజొన్న వడలు నైవేద్యంగా పెడతారు.
ఐదవ రోజు..
ఐదో రోజు అమ్మవారిని లలితా దేవి అలంకరణలో దర్శనమిస్తుంది.
అమ్మవారిని ఎరుపు రంగు వస్త్రంతో అలంకరిస్తారు.
నైవేద్యంగా దద్ద్యోజనం సమర్పిస్తారు.
ఆరవ రోజు
ఆరో రోజు.. అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీ దేవిగా అలంకరిస్తారు..
గులాబీరంగు వస్త్రంతో అలంకరిస్తారు.
నైవేద్యంగా కేసరి సమర్పిస్తారు.
ఏడవ రోజు
జగన్మాత సరస్వతి రూపంలో దర్శనమిస్తుంది.
మూల నక్షత్రం రోజున సరస్వతిదేవిని తెలుపు రంగు చీరలో అలంకరిస్తారు.
నైవేద్యంగా పరమాన్నం, అల్లం గారెలు సమర్పిస్తారు.
ఎనిమిదవ రోజు
ఈరోజు అమ్మవారిని మహాగౌరి ( దుర్గా దేవి ) రూపంలో అలంకరిస్తారు.
ఈరోజు అమ్మవారిని ఆకుపచ్చ రంగు వస్త్రంతో అలంకరిస్తారు.
నైవేద్యంగా శాకాన్నం లేదా కలగూర పులుసు సమర్పిస్తారు.
తొమ్మిదవ రోజు
తొమ్మిదో రోజు.. మహిషాసురమర్దిని గా అమ్మవారు దర్శనమిస్తారు.
అమ్మవారికి నీలం రంగు వస్త్రంతో అలంకరిస్తారు.
ఈ రోజు నైవేద్యంగా రవ్వతో చేసి చక్కెర పొంగలి సమర్పిస్తారు.
పదవరోజు
పదో రోజైన విజయదశమినాడు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా కొలువుతీరుతుంది.
ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించి లేత గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఇది శుభానికి సంకేతం
నైవేద్యంగా సేమ్యా పాయం, కొబ్బరి పాయసం, కొబ్బరి అన్నం, పరమాన్నం సమర్పిస్తారు.