ఏడేడు రంగుల చీర తెచ్చామమ్మ - అమ్మవారి భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

గానం: గంగపుత్ర నర్సింగ్ రావు గురుస్వా


ఏడేడు రంగుల చీర తెచ్చామమ్మ 

చీర తెచ్చామమ్మ 

గచ్చా గవ్వలు కుట్టి రవిక తెచ్చామమ్మ - 

రవికె తెచ్చామమ్మ 

బావిలోన ఉన్నావే బంగారు తల్లి బల్కంపేట ఎల్లమ్మో - బల్కంపేట ఎల్లమ్మో

॥ఏడేడు రంగుల॥ ॥ కోరస్||

పరమ శివుని అంశంతో పుట్టినావే మాయమ్మ 

ఆ పరశురామునికి తల్లివైనావమ్మ 

కొమరవెల్లి మల్లన్న ఆడపడుచు నీవమ్మ 

మా ఇంట ఇలవేలుపు నీవేనే మాయమ్మ  

అరె... అరె...అరె... అరె...

॥ఏడేడు రంగుల॥ ॥కోరస్||

నిండు మంగళారమున నిన్ను కలువ మాయమ్మ 

మట్టి నిండు కుండలోన నైవేద్యం వండుకుని 

మా ఇంటి ఆడపడుచు బోనమెత్తి నడవంగా 

నీ తమ్ముడు పోతురాజు శివమెత్తి ఆడంగా 

అరె... అరె...అరె... అరె...

॥ఏడేడు రంగుల॥ ॥ కోర

చిలక రంగు పట్టు చీర కట్టినావే మాయమ్మ ముక్కుకు ముత్యాల పోగు పెట్టినావే మాయమ్మ చారడంత బొట్టున్న చామండివి నీవమ్మ 

చల్లంగ చూడరావే చల్లనైన మాయమ్మో

అరె... అరె...అరె... అరె...

॥ఏడేడు రంగుల|| ||కోరస్||



ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.

లిరిక్స్ పంపినవారు : 

*వై. వెంకటసుబ్బారెడ్డి స్వామి*





#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat