అహా ఏమని వర్ణించను అయ్యప్ప స్వామి మోహనరూపం - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

 అహా ఏమని వర్ణించను అయ్యప్ప స్వామి మోహనరూపం ||2||


పాల కడలినే మధనము చేయగ ॥ 

అమృత కలశం పుట్టినదిరా ॥ 

అమృత బాండము పంచగ శౌరి ॥ 

మోహినిరూపం దాల్చినాడు రా॥ (ఆహా!)


మోహిని రూపము మోహము రేపగ  ॥ 

పరమేశ్వరుడే పూనినాడురా ॥ 

హరిహర దేవుల పుణ్య ఫలముగా ॥ 

అయ్యప్పస్వామి అవతరించేరా  (ఆహా!)


గర్వాంతుడైన మహిషిని చంపి  ॥ 

ప్రజాలనెల్ల కాపాడినాడురా ॥ 

'బ్రమ్మచర్యమే దీక్షగభూమి ॥ 

శబరిమాలై కి తరలి వెళ్లిరా (ఆహా!)


పావనమగు ఆ పంబానదిలో 

పాపాలను ప్రక్షాళన చేయగా .2.

భక్త కోటికే ముక్తిని చూపగు .2 .

జ్యోతి రూపుడై వెలసి నాడురా   (ఆహా!)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!