నిన్నే నమ్ముకున్న / Ninne Nammukunna - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

  స్వామి  అయ్యప్పా ...శరణమయ్యప్పాయా ,

     నిన్నే  నమ్ముకున్న  కరుణించుమయ్యప్ప  .
     దీనజన  రక్షక  మా  దిక్కు  నీవయ్యా.

01. శరణుఘోష  పాడుకుంటూ  నిన్ను  వేడుకుంటున్నా .
     నాకెమూటలు  ఒద్దు  సిరులు  సంపదలు  ఒద్దు .
     నా  ఆత్మ  లో  నీవు  ఉంటే .........................
     నా  ఆత్మ  లో  నీవు  ఉంటే, అంతకన్నా  మిన్న  లేదు.

02. అలసిపోయి  నిలిచి  ఉన్న  ఆదరించవేమయ్య .
     అంతర్యామివి  నీవే  అన్నదాన  ప్రభువు  నీవే .
     చేతులెత్తి  మొక్కుతున్న  చింత  బాపవేమయ్య .
     నీ  గుడి  వాకిట  నేనూ.........................
     నీ  గుడి  వాకిట  నేనూ , దివ్వెనైతే  చాలున్నాయా .

03. మెతుకుకు  గతి  లేకున్నా  మేడలా  మాల  వేసుకున్న .
     కష్టాలెన్నెదురైనా  స్వామి  నిన్ను  నమ్ముకున్న .
     మోక్షమిచ్చు  స్వామివని  నిన్ను  వేడుకుంటున్న 
     నీ  పాదమునంటివున్న .......................
     నీ  పాదమునంటివున్న , మువ్వనైతే  చాలున్నాయా .

04. మరువను  నీ  శరణుఘోష , నా  ఊపిరికి  ఆగుదాకా 
     నా  హృదయము  స్వామి  నీకు , కోవెలగ  చేసినను .
     నా  శ్వాసని  స్వామి  నీకు  హారతిగా  ఇచ్చెదను .
     ఆ   క్షణం  అయ్యప్ప  అంటూ .....................
     ఆ   క్షణం  అయ్యప్ప  అంటూ ,హాయిగా  కాను  మూస్తానయ్య


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!