ఎన్నో నోములు / enno nomulu

P Madhav Kumar

ఎన్నో నోములు నోచిన గాని (2 )
ఎన్నో పూజలు చేసిన గాని
ఈ నర జన్మము దొరకదు రా


ఈ జన్మంబున చేసిన పుణ్యము
ముని జన్మకు మూటలు రా     
నారాయణ హరి నారాయణ... (2 )      Fast.....


సత్యము, ధర్మము, ప్రేమా, కరుణ,
ఉత్తమ గతికి సాధన రా
నారాయణ హరి నారాయణ... (2 )      Fast.....


పలికి బొంకినా పాడి మీరినా,
బ్రతుకంతా చెడిపోవును రా
నారాయణ హరి నారాయణ... (2 )      Fast.....


దాన ధర్మములు చేసిన ఫలమిది,
ఈ నర జన్మము సఫలము రా
మూడు రోజుల ముచ్చట కొరకై,
ఈ నర జన్మము సలపకురా
నారాయణ హరి నారాయణ... (2 )      Fast.....






Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat