ముత్యాల పందిళ్ళలోకి.... నా స్వామి రారా / Mutyala pandilla loki na swamy rara - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

ముత్యాల పందిళ్ళలోకి.... నా స్వామి రారా

మా మండల పూజ లోకి... మణికంఠ రారా

నా స్వామి రారా.... అయ్యప్ప రా రా

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. //2//


పద్దేనిమిది మెట్లపైకి పరమాత్మ రారా

మెట్టు పెట్టుకు ఒక్క పండు ఆరగించి నా స్వామి రారా.... అయ్యప్ప రా రా

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. //2//


అటుకులు బెల్లాలు ఎంతో ఇష్టమైన వాడా 

అరవన్న పాయసాలు ప్రియమైన వాడా

నా స్వామి రారా.... అయ్యప్ప రా రా

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. //2//


మల్లెలు చామంతలతో బంతులాడ రారా

చిన్ని చిన్ని పాదాలలో చిన్ముద్రుడా రారా

నా స్వామి రారా.... అయ్యప్ప రా రా

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. //2//


కన్నెసామి కనులలో కదలాడే దేవ

గురుస్వామి గుండెల్లో కొలువుదీరినారా

నా స్వామి రారా.... అయ్యప్ప రా రా

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. //2//



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!