కొండల్లో కొలువున్న కొండదేవరా / Kondallo Koluvunna Kondadevara - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

    కొండల్లో కొలువున్న కొండదేవరా
    మాకొర్కేలన్ని దీర్చవయ్య కొండదేవరా
1.    కార్తీక మసాన కొండదేవరా
    మేము మాలలే వేస్తాము కొండదేవరా         ||కొం||
2.    అళుదమలై (నది) శిఖరాన కొండదేవరా
    మమ్ము ఆదరించి చూడవయ్య కొండదేవరా     ||కొం||    
3.    కరిమలై శిఖరాన కొండదేవరా
    మమ్ము కరుణించగ రావయ్య కొండదేవరా     ||కొం||
4.    పంపానది తీరాన కొండదేవరా
    మా పాపములను బాపవయ్య కొందడేవరా     ||కొం||
5.    పదునెనెమిది మెట్లెక్కి కొండదేవరా
    మేము పరవశించినామయ్య కొండదేవరా         ||కొం||
6.    నెయ్యాబిషేకమయ్య కొండదేవరా
    నీకు మెండుగా జరిపిస్తాం కొండదేవరా         ||కొం||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!