కన్నెస్వామి గురుస్వామి నిను చూడగ వచ్చాము - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

కన్నెస్వామి గురుస్వామి నిను చూడగ వచ్చాము 

కన్నులార నిన్ను చూడ నీ సన్నిధి కొస్తాము

ఎందుదాగి వున్నావయ్యో అయ్యప్పస్వామి | 

తొందరగా రావేమయ్యో అయ్యప్పస్వామి.   //కన్నె//


నలుబది రోజులు మేము దీక్షలన్నీ చేసాము

 పంపానదినీ చేరి జలకములే ఆడేము

 ఏకాంత వాసుడైతివో అయ్యప్పస్వామి

 ఎరుమేలిలో దాగివుంటివో అయ్యప్పస్వామి  //కన్నె//


కులమత భేదాలు లేని కలియుగ వరదుడవు నీవు  

నీతీ నియమాలతోడ నీ సన్నిధి కొచ్చేము 

వట్టి మాటలివి కావయ్యో అయ్యప్పస్వామి | 

మెట్లకే దండాలయ్యో అయ్యప్పస్వామి 

గురుడుకే దండాలయ్యో అయ్యప్పస్వామి 

జ్యోతికే దండాలయ్యో అయ్యప్పస్వామి 

మకర జ్యోతికే దండాలయ్యో అయ్యప్పస్వామి   //కన్నె//

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!