Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

18. బొజ్జనరే బొజ్జరే ఏక దంతుడానరే - bojjanare bojjare ekadantudanaare - వినాయక భజన పాటల లిరిక్స్


బొజ్జనరే బొజ్జరే ఏక దంతుడానరే !!2!!

1. మాత పార్వతీదేవి మహిమతోడ సృష్టించే
తండ్రి నీలకంఠుడేమో తలను నరికి పారేసే '
తనయుని కొరకు తల్లి దుఃఖమును దాల్చలేక
గజము తలను తెచ్చిపెట్టి గజేంద్రుడని పేరు పెట్టే
జై జై జై... బొజ్జనరే బొజ్జరే ఏక దంతుడానరే !!2!!

2. ముందు పూజ నీదేనంటు పూనుకుంటి యజ్ఞంబు
మూడులోకములకు నీవే నొజ్జవై వెలుగొందు
సురులు కాని నరులుకాని నీ నామస్మరణంబు చేయ
విఘ్నములను పారద్రోలు వినాయకునిగా నీవు
జై జై జై... బొజ్జనరే బొజ్జరే ఏక దంతుడానరే !!2!!

3. చందురుడు నిన్నుచూసి నవ్వినాడు అలనాడు
కోపంబుతో ఉగ్రుడవై శాపంబు పెట్టినావు
చవితినాడు చందురున్ని తిలకించిన జనులందరు
నిందలు అపనిందలుగా మోపబడుదువన్నావే
జై జై జై... బొజ్జనరే బొజ్జరే ఏక దంతుడానరే !!2!!
📢 Follow