ఏడు కొండల స్వామి కనరా మమ్ము
నీ నీడలలో నిలుచున్న నిరుపేదలం
1. నీ రత్నహారాలు మెరిసేనులే
ఆ మెరుపుల్లో లోకాలు మురిసేనులే
ఖగవాహన నీ గళమందున
ఖగవాహన నీ గళమందున
ధరియించే సలాబీలు పూ మాలలు
ఏడు కొండల స్వామి కనరా మమ్ము
నీ నీడలలో నిలుచున్న నిరుపేదలం
2. అందాల నీమోము నందుండినా
నీ నాయంటే మారక నారాయణా
చంద్రాననా నీ వెందేగినా
చంద్రాననా నీ వెందేగినా
నీ సుందర వదనంబు లుపించెనా
ఏడు కొండల స్వామి కనరా మమ్ము
నీ నీడలలో నిలుచున్న నిరుపేదలం
3. శేషాద్రి శిఖరాన వెలశావని
నీ సేవకుల రక్షింప నిలశావని
అన్నాడులే మే మిన్నాము లే
అన్నాడులే మే మిన్నాము లే
మా కనులార కనిపించ దిగిరావయ్యా
ఏడు కొండల స్వామి కనరా మమ్ము
నీ నీడలలో నిలుచున్న నిరుపేదలం