శాస్త్రా సన్నిధిలో అభిషేకం / Shasra Sannidhilo Abhishekam - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

శాస్త్రా సన్నిధిలో అభిషేకం
ధర్మశాస్త్రా సన్నిధిలో అభిషేకం ||శాస్త్ర||


ఆవు పాలు తెచ్చినాము అయ్యప్పా
నీకు పాలాభిషేకమయ్యా అయ్యప్పా   ||శాస్త్ర||


ఆవు పెరుగు తెచ్చినాము అయ్యప్పా
నీకు దద్యాభిషేకమయ్యా అయ్యప్పా  ||శాస్త్ర||


ఆవు నెయ్యి తెచ్చినాము అయ్యప్పా
నీకు నెయ్యాభిషేకమయ్య అయ్యప్పా  ||శాస్త్ర||


పట్టు తేనే తెచ్చినాము అయ్యప్పా
నీకు తేనాభిషేకమయ్యా అయ్యప్పా  ||శాస్త్ర||


పంచదార తెచ్చినాము అయ్యప్పా
నీకు చక్కెరాభిషేకమయ్యా అయ్యప్పా  ||శాస్త్ర||


అరటిపండ్లు తెచ్చినాము అయ్యప్పా
నీకు పండ్లాభిషేకమయ్య అయ్యప్పా   ||శాస్త్ర||


నారికేళం తెచ్చినాము అయ్యప్పా
నీకు ఫలోదక స్నానమయ్యా అయ్యప్పా  ||శాస్త్ర||


విభూతి తెచ్చినాము అయ్యప్పా
నీకు భస్మాభిషేకమయ్యా అయ్యప్పా  ||శాస్త్ర||



మంచి గంధం తెచ్చినాము అయ్యప్పా
నీకు గంధాబిషేకమయ్య అయ్యప్పా  ||శాస్త్ర||


ఎర్ర చందనం తెచ్చినాము అయ్యప్పా
నీకు కుంకుమాభిషేకమయ్య అయ్యప్పా  ||శాస్త్ర||


మంచి నీరు తెచ్చినాము అయ్యప్పా
నీకు పన్నీరాభిషేకమయ్యా అయ్యప్పా  ||శాస్త్ర||



పంప నీరు తెచ్చినాము అయ్యప్పా
నీకు శుద్ధోదక స్నానమయ్య  అయ్యప్పా  ||శాస్త్ర||


మల్లెపూలు తెచ్చినాము అయ్యప్పా
నీకు పూలాభిషేకమయ్యా అయ్యప్పా  ||శాస్త్ర||



కర్పూరం తెచ్చినాము అయ్యప్పా
మా మంగళహారతులందుకో అయ్యప్పా  ||శాస్త్ర||


భక్తితోటి వచ్చినాము అయ్యప్పా
మాకు ముక్తి భిక్ష పెట్టవయ్య అయ్యప్పా  ||శాస్త్ర||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!