ఎవరీ శ్రీధర్మశాస్తా ?

ఎవరీ శ్రీధర్మశాస్తా ? 
శివుడే శ్రీధర్మశాస్తా ! అదెలాగంటే ? ఈ సకల చరాచర జగత్తు సృష్టించబడాలన్నా, సృష్టి వృద్ధి చెందాలన్నా, సృష్టి “లయం” అయిపోవాలన్నా ధర్మబద్దంగానే జరగాలి. కనుక సృష్టికి ఆదిలో శివుడు “ధర్మాన్ని” సృజించాడు. అట్టి ధర్మాన్ని అఖిలమంతా వ్యాపింపజేయడం కోసం, సకల దేవతలకు ఆయా దేవతా ధర్మాలను బోధించడం కోసం, సకల ప్రాణులలో ఆయా జీవధర్మాలను నిక్షిప్తం చేయడంకోసం, ధర్మాన్ని అన్ని లోకాలలోను విస్తరింపజేయడం కోసం శివుడే శ్రీధర్మశాస్తాగా అవతరించాడు.
ధర్మశాస్తాగా నేను అవతరిస్తుంటాను అనిశివుడు పార్వతితో పలికిన విధమిది శ్లోకం : ధర్మనాశే యదాదేవి అధర్మశ్చైధతేయదా
తధా ధర్మశ్య “శాస్త్రా”హం భవిష్యామి మనోహరే (అయ్యప్ప గీతలోని 10వ అధ్యయంలోని శ్లోకం ఇది) దీని అర్థం ఏమిటంటే?
ఎప్పుడు ధర్మము నశించుచు, అధర్మము వృద్ధిచెందుచుండునో, అప్పుడు ధర్మమును నిలుపుటకై నేను “ధర్మశాస్తా”గా అవతరించెదను అని అర్థం .
దీక్షాకాలంలో నిత్యం మనం చేసే పూజలో పలికే నామాలలో, మహా సర్ప విభూషితాయ నమః, వ్యాఘ్రచర్మధరాయ నమః, శూలినే నమః, జటాధరాయ నమః, అగ్నినయనాయ నమః, మహేశ్వరాయనమః వంటి నామాల ద్వారా శాస్తా శివుడే అని తెలుసుకోవచ్చు. శివుణ్ణి మహాదేవుడని అంటారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!