నా ప్రాణ దాత నీవే నా పంచ ప్రాణం నీవే
నా లోన కదలాడే నా జీవ నాదం నీవే
ఏ ఆశ నాకు లేదు దేవరా....
నా లోన కదలాడే నా జీవ నాదం నీవే
ఏ ఆశ నాకు లేదు దేవరా....
నా శ్వాస శరణుఘోష చేసేదా....(2)
నా మనసు ప్రతిదినము నీ స్మరణ మరువదయా
నా తలపు ప్రతి క్షణము నీ ధ్యాస విడవదయా (2)
నా ఉనికి నాకు లేనే లేదురా.... నాలోన నీవే నిలిచినావురా....(2)
నా కంటిపాపలోనా నీరూపు నిలిచి ఉంది
నా నోటి ప్రతి మాట నీ పేరే పలుకుతుంది
నా తనువులోని అణువణువునా.....
నా మనసు ప్రతిదినము నీ స్మరణ మరువదయా
నా తలపు ప్రతి క్షణము నీ ధ్యాస విడవదయా (2)
నా ఉనికి నాకు లేనే లేదురా.... నాలోన నీవే నిలిచినావురా....(2)
నా కంటిపాపలోనా నీరూపు నిలిచి ఉంది
నా నోటి ప్రతి మాట నీ పేరే పలుకుతుంది
నా తనువులోని అణువణువునా.....
అయ్యప్ప నీవే నిండినావయా.... (2)
ఏనాడో చేసిన పుణ్యం ఈనాడే ఎదురయ్యిందా
ఏనాడో చేసిన పుణ్యం ఈనాడే ఎదురయ్యిందా
ఆ బ్రహ్మ రాసిన రాత ఈ జన్మ నుదుటి గీతా....(2)
మీ సేవ భాగ్యమ్ము దొరికేరా....
ఈ జన్మకింకేమీ కావాలిరా.....
వరాల పసిడిమూట వాచించ లేను స్వామి
ఘనమైన ధనరాసి నే కోరలేదు స్వామి...(2)
నీ గాన సేవే నాకు సర్వమూ.... ఆ సేవలోనే ఉంది స్వర్గమూ.....(2)
నా ప్రాణ దాత నీవే నా పంచ ప్రాణం నీవే
నా లోన కదలాడే నా జీవ నాదం నీవే
ఏ ఆశ నాకు లేదు దేవరా....
నా శ్వాస శరణుఘోష చేసేదా....(2)