గానం : జంగిరెడ్డి గురుస్వామి
ఘల్లు ఘల్లు ఘల్లున రావయ్య గణముల అధిపతి గణపయ్య ||కోరస్||
భల్లు భల్లు భల్లున లేవయ్య భజనల దళపతి బలమియ్య ||కోరస్||
శరణం శరణం గజానన శివబాల గజ ముఖ వదన||కోరస్||
||ఘల్లు ఘల్లు ఘల్లున రావయ్య ||
పిండి బొమ్మకే పురుడు పోసిన తల్లి పార్వతమ్మ
ప్రణప్రదంగా నిన్ను చూసిన గౌరి దేవతమ్మ
తల్లి మాటనే జవదాటని తనయుడవే నీవయ్య -
తండ్రి తానే అని తెలియక శివుడిని అడ్డగిస్తివయ్య
గౌరీ సుతుడా గజానన గండరీ గండ గజవదనా
||ఘల్లు ఘల్లు ఘల్లున రావయ్య||
కోపమాగని శివుడు నీ శిరస్సు ఖండించేనయ్య -
పార్వతి వేడగ నీ రూపము ఇక గజ ముఖ మాయెనయా
శివపార్వతుల ప్రేమ సన్నిధిలో పెరిగిన గణపయ్య
నిరతం వారి సేవలోనే తరించినావయ్య
లంబోదరుడా గజానన లకుమికూడా గజముఖ వదన ||కోరస్||
||ఘల్లు ఘల్లు ఘల్లున రావయ్య||
ముల్లోకాలు తిరగక మూషిక వాహనమొచ్చెనయ
ఎలుక నెక్కే ఈ ఏనుగు కథ భలే విచిత్రమేనయ
జ్ఞాన జ్యోతులను వెలిగించగ ఇల గుణ గుణ రావయ్య
విఘ్నాలను కలిగించక మమ్ము దీవించావయ్య
విఘ్న వినాయక గజానన - జ్ఞాన ప్రదాయక గజ వదన ||కోరస్||
||ఘల్లు ఘల్లు ఘల్లున రావయ్య||
శరణం శరణం గజానన
శివబాల గజ ముఖ వదన
శరణం శరణం గజానన
శివబాల గజ ముఖ వదన ||2|| ||కొరస్||
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
లిరిక్స్ పంపినవారు :
*వై. వెంకటసుబ్బారెడ్డి స్వామి*