అయ్యప్ప ఋణం / Ayyappa Runam - అయ్యప్ప భజన పాటల లిరిక్స్


అయ్యప్ప ఋణం 

అయ్యప్పా....... అయ్యప్పా....... అయ్యప్పా ....... అయ్యప్పా...

ఏమిచ్చి నీ ఋణముతీర్చుకుందు రా .....
నేనేమిచ్చి నీ ఋణము తీర్చుకుందు రా......
చల్లని అయ్యప్పా మా స్వామి చక్కని అయ్యప్ప
బంగారు కొండలో వెలిసిన మా దేవుడు నీవయ్య
మా రాజువు నీవయ్య                                      (అయ్యప్ప)



మాకై పుట్టిన దేవుడా మల్లి పుట్టిన శ్రీ రాముడా
రాజ్యమేలమని తండ్రి చెప్పిన వనవాస మెల్లవురా
మాకై కొండల్లో నిలచావు రా.....                   (అయ్యప్ప)



కొండల్లో ఏమున్నదయ్యా మా గుండెలో చూడరాదయ్యా
గుండె గుండె కో గుడిని కట్టి పూజలు చేసేము రా
పులా సేవలు చేసేము రా .......                   (అయ్యప్ప)



పారేటి సెలయేరు గంగను తెచ్చి
పంచ నాగుల ఆవు పాలను తెచ్చి
అభిషేక పూసలు నీకు చేసిన ఋణము తీరున
నా ఋణము తీరునా ....                            (అయ్యప్పా)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!