*పల్లవి :*
మల్లెపూల గణపతి వందనమయా
మామంచి గణపతి దండాలయా || కో ||
మహాగణపతికి వందనమయా మమ్మేలు స్వామికి దండాలయా ||కో||
కోటికోటిదండాలయ్యా గణపయ్యనీకు శతకోటి వందనాలయా ||కో||
చిరునవ్వుతొ చల్లగచూసి నీ భక్తులను అభయమిచ్చి ఆదుకోవయా ||కో|| ॥మల్లె॥
చరణం - 1 :
ముందునిన్నే పూజింతుమయా ముద్దులొలికే ముక్కంటితనయా
గణేశ శరణం శరణు గణేశా శరణం శరణం వినాయకా
పాపనాశక పార్వతి తనయా పాదపూజలు గైకొనుమయ్యా
గణేశ శరణం శరణు గణేశా శరణంశరణం వినాయకా
విఘ్నాలను తొలగించు విఘ్నేశ్వర దేవుడా ||కో||
అభయమిచ్చి ఆదుకోర అంబికా పుత్రుడా ||కో||
నమ్మికొలచినవారికి బంగారు కొండవురా
గణపతి పప్పాయోరియా
॥మల్లె||
చరణం -2
శ్రీశైలంలో సాక్షి గణపతి కాణిపాక మహా గణపతి
గణేశ శరణం శరణు గణేశ శరణం శరణం వినాయకా
శబరిమలలో కన్నిమూల గణపతి కాళహస్తిలో పాతాళ గణపతి
గణేశ శరణం శరణు గణేశా శరణం శరణం వినాయకా
భక్తులకువరము లిచ్చు బంగారు గణపతి ||కో||
సిద్ధిబుద్దిని ఇచ్చే వరసిద్ధి గణపతి ||కో||
తొలిపూజలందుకోర శ్రీలక్ష్మీగణపతి
గణపతిపప్పా మొరియా
||కో|| మల్లెపూల గణపతి వందనమయా
మామంచి గణపతి దండాలయా
మహాగణపతికి వందనమయా మమ్మేలు స్వామికి దండాలయా
కోటికోటిదండాలయ్యా గణపయ్యనీకు శతకోటి వందనాలయా ||కో||
చిరునవ్వుతొ చల్లగచూసి నీ భక్తులను అభయమిచ్చి ఆదుకోవయా ||కో||
గణపతిపప్పా - మొరియా
విఘ్నవినాయక - మొరియా
మూషికవాహన - మొరియా
మొరియారేపప్పా - మొరియా
ఈ పాటను ఎలా పాడాలి ఇక్కడ టచ్ చేసి చూడండి.
*స్వామియే శరణం అయ్యప్ప*