॥ అమ్మ కర్పూర నాయకీ ॥ భజన పాటల లిరిక్స్


అమ్మ కర్పూర నాయకీ కనకవల్లీ 

మమ్ము కరుణించి కాపాడు మారియమ్మ ॥ అమ్మ ॥


కాశీలోన వెలసినావు మారియమ్మ 

అమ్మ విశాలాక్షి అవతార మెత్తినావమ్మ ॥ అమ్మ ॥


కంచిలోన వెలసినావు మారియమ్మ 

అమ్మ కామాక్షి అవతార మెత్తినావమ్మ ॥ అమ్మ ॥


మధురలోన వెలసినావు మారియమ్మ 

అమ్మ మీనాక్షి అవతార మెత్తినావమ్మ ॥ అమ్మ ॥


బెజవాడలో వెలసినావు మారియమ్మ 

అమ్మ కనక దుర్గమ్మ అవతార మెత్తినావమ్మ ॥ అమ్మ ॥


శ్రీశైలంలో వెలసినావు మారియమ్మ 

అమ్మ భ్రమరాంబ అవతార మెత్తినావమ్మ    ॥ అమ్మ ॥


మైసూరులో వెలసినావు మారియమ్మ 

అమ్మ చాముండేశ్వరి అవతార మెత్తినావమ్మ    ॥ అమ్మ ॥


కలకత్తాలో వెలసినావు మారియమ్మ 

అమ్మ కాళికా అవతార మెత్తినావమ్మ    ॥ అమ్మ ॥


ఆదిశక్తి పరాశక్తి నీవేనమ్మ 

మమ్ము కరుణించి కాపాడు మాయమ్మ    ॥ అమ్మ ॥

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!