Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

తొలిపూజ నీదేలే విగ్నేశ్వరా - వినాయక భజన పాటల లిరిక్స్



తొలిపూజ నీదేలే విగ్నేశ్వరా
ఓ బొజ్జ గణపయ్య దీవించారా
ఓ.. గణనాయకా ఓ.. గౌరీ పుత్ర..
తొలిపూజ నీదేలే విగ్నేశ్వరా
ఓ బొజ్జ గణపయ్య దీవించారా

ఇంతింత కాదయ్యా నీ మహిమలు
ఘనమైన పూజలు నీ కోసము
పార్వతి నందన లంభోదర
పావనరూప విగ్నేశ్వరా

కోటొక్క దండాలు గణనాథుడా
నీకు పాదాలకు నమస్కారం విఘ్నేశ్వరా
పసివాని నవ్వులు నీ నవ్వులు
చిన్ని చిన్ని పలుకులు నీ మాటలు

తొలిపూజ నీదేలే విగ్నేశ్వరా
ఓ బొజ్జ గణపయ్య దీవించారా
ఓ.. గణనాయకా ఓ.. గౌరీ పుత్ర..

నీకన్నా మాకింకా ఎవరున్నారో
నీవేకదా మాకు తొలిదైవము
కుడుములు వుండ్రాలు నీ కోసము
మా హ్రదయం హారతి నీకిద్దుము

తొలిపూజ నీదేలే విగ్నేశ్వరా
ఓ బొజ్జ గణపయ్య దీవించారా
ఓ.. గణనాయకా ఓ.. గౌరీ పుత్ర..
తొలిపూజ నీదేలే విగ్నేశ్వరా
ఓ బొజ్జ గణపయ్య దీవించారా || 2 ||

గణేష్ మహారాజ్ కి - జై


📢 Follow