అయ్యప్ప జోల పాట (మాదిరి: అన్నమయ్య కీర్తన) - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

అన్ని సేవలయ్యెనయ్య హరిహరాత్మజా

అన్ని సేవలయ్యెనయ్య హరిహరాత్మజా 

ఆలకించి ఆదుకొనుము అయ్యప్ప దేవా....     |అన్ని|


ప॥ కంటి నీదు దివ్య అభిషేకము స్వామి 

అంటి ఉప్పొంగి నీదు చరణాలే శరణమని.   |కంటి|


1 చేసితి నీకు దివ్య అలంకారము 

నవరత్న కచిత బంగారు ఆభరణములు  (2)

అష్టోత్తర నామాలతో అర్చన చేసి     (2)

పాయాస నైవేద్యం అర్పణ చేసి.       |కంటి|


2 అలరారిన నీకు మంగళ హారతినిచ్చి 

వేద మంత్రపుష్పాలతో కొలిచానయ్యా 

కంటి నీదు దివ్య అలంకారము స్వామి 

అంటి ఉప్పొంగి నీదు చరణాలే శరణమని.     |కంటి|


3 అన్ని సేవలు చేసి సంతృప్తి నొందినే 

జోల పాడెద నీకు అయ్యప్పా      (2)

అందరిని ఆదుకొని ఆదమరచిన నీకు 

ఆనందమున పాడు ఉయ్యాల.     (2)

ఉయ్యాలా.... ఉయ్యాలా.       (2)



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!