ఏ దారి ఎచ్చటికో శంకరా
ఏవరి దారి యెచ్చటకో హర హరా
కడదాక యెవరో చితిదాక యెవరో
ఎవరికి యెవరో..... చివరికి యెవరో
సంకటహరణా... చూపుము కరుణ
నాగా భరణా గౌరీరమణా.
మాయలో పుట్టేము మాయలో పెరిగేము.
పెను మాయలో తేలియాడేము.
నీమాయ మేమెరుగక మాయమై పోయేము
మా మాయాతొలగించి ముమ్మా వల దరిజేర్చు
మమ్ము బ్రోవ రావా... గౌరీశంకరా హరా
శోకముతో పుట్టుక భవ బంధాలతొ బాధలు
చివరి యాత్ర తీరని శోక సంద్రమాయె "2"
నీశ్లోక మేమెరుగక శోకములొ మునిగేము
మా భ్రాంతి తొలగించి మమ్మావల దరిజెర్చు
మమ్ముకావరాదా....గౌరీ శంకరా హరా
తలచేది ఒక్కటి జరిగేదింక్కొక్కటి "2"
తలచేవి జరగకా తల్లడిల్లేమయ్యా
నీ వాడించేవు తోలు బొమ్మలాట
నీ ఆట మేమెరుగక మా ఆట ముగిసేను
మమ్ముకావరావా ఉమాశంకరాహరా
డోలక్ : రమేశ్ బృందావన్
రాగం : శివరంజని