సాకి :-
ఈశ్వరా సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి
భ్రామయన్ సర్ప భూతాని యంత్రారూఢ నిమాయయా
పల్లవి :-
శ్రీ మహేశ గౌరీశ శంకర
పాహిమాం పరమేశ ఈశ్వర
మీ మహూన్నత సద్గుణంబులు
మునివరేణ్యులు తెలుప వింటిమి.
౹౹శ్రీ మహేశ౹౹
చరణం:-
సాలెపురుగు సర్పం ఏనుగు
భక్తిచే కైవల్యం పొందెను
నిరతమూ నిను ఆరాధించెద
కరుణనేలగ రార హరహర శివ శంభో.
౹౹శ్రీ మహేశ౹౹
చరణం:-
ప్రళయమౌనని హాలాహలము
కంఠమందున నిల్పినావు
అండపిండ బ్రహ్మండంమంతయు
కాచినావు మహేశ హరహర శివ శంభో.
౹౹శ్రీ మహేశ౹౹
మిత్ర :-
శ్రీ మహేశ పాపవినాశ ఫాలనేత్ర పన్నగ భూష
నీలకంఠ నిఖిలాదార నీవె శరణు హరహర శివ శంభో