శరణములంటే మరణము / Sharanam Ante Maranam - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

శరణములంటే మరణము లేదూ - అయ్యప్ప నామం తారక మంత్రం
తరుణం ఇదిరా వదలుకోకు - ధర్మశాస్తా పదములు పాడు (శరణము)

కోరిక తీర్చే వెంకన్న నామం - కరుణయు కురిసే కపిలయ్య నామం
కలసి పుట్టిన అయ్యప్ప నామం - తలచియుంటే భువిలో క్షేమం   (శరణము)

కొండకోన యిల్లు వాకిలి - రాళ్లు ముళ్ళు మల్లెల పానుపు
కోరికలణచి భక్తితో రారా - అయ్యప్ప స్వామిని చూదాంరారా   (శరణము)

ఉండేటపుడీ లోకం చుట్టం - పోయిన మిగిలే బంధువెవరు
గురువును చేరి మాలధరించి - హరిహరసుతుని జ్యోతిగ చూడు
శరణం శరణమయ్యా స్వామి శ్రీ అయ్యప్ప
అయ్యప్పా శరణం శరణం శ్రీ అయ్యప్ప
 వెన్నెలాకరిగే హృదయమునయ్యప్పా - నివసించి కరుణతో కాపాడునులే
స్వర్ణమందిర జ్యోతి స్వరూపా - మహిషి మర్దన మోహిని పుత్రా   (శరణము)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!