నమో సాంబశివా – హరహర
నమో పార్వతీశా – హరహర
నమో పార్వతీశా
నమో సాంబశివా – హరహర
నమో పార్వతీశా – హరహర
1. సహస్ర కోటి సూర్యప్రకాశ
ముజ్జగములకు ఈశా మహేశా
దేవాసురలు మధనము చేయగ
జగతి దహించెడి గరళము నిలిపి
నమో సాంబశివా – హరహర
నమో పార్వతీశా – హరహర
2. పాశుపతంబును పార్ధుడు కోరగ
ఫల్గుణ శక్తిని పరిశీలించగ
కిరాత రూపుని కిరీటి తోడు
పోరు సల్పిన ఈశా మహేశా
నమో సాంబశివా – హరహర
నమో పార్వతీశా – హరహర
3. కైలాసములో కొలువు తీరగా
నాగులు మెడలో నాట్యమాడగా
ఘనముని గణములు శంఖములూదగా
తాండవ మాడిన తాలడవ ఈశా మహేశా
నమో సాంబశివా – హరహర
నమో పార్వతీశా – హరహర