శ్రీశైల వాస కళ్యాణం కనరండి నేడు వైభోగం
బ్రమరాంబ విభుని కళ్యాణం శ్రీశైల మంత సింగారం
1. శ్రీనగము పెళ్ళి పీటై ఆ గగనాన పందిరేసి
కురి చేను పూల వాన శ్రీశైల శిఖరి పైన
మ్రోగెను దేవ దుందుబులు పాడేరు సురలు మునులు
శ్రీశైల వాస కళ్యాణం కనరండి నేడు వైభోగం
బ్రమరాంబ విభుని కళ్యాణం శ్రీశైల మంత సింగారం
2. అదిగదిగో చంద్రవంక శిగలోన గంగ నడక
పరమేష్టి పెళ్ళికొడుకై శంగారి గౌరి వంక
శ్రీమల్లేశుని కళ్యాణం కనరండి నేడు వైభొగం
శ్రీశైల వాస కళ్యాణం కనరండి నేడు వైభోగం
బ్రమరాంబ విభుని కళ్యాణం శ్రీశైల మంత సింగారం
3. బ్రమరాంబ తల్లి రావే నిన్నేలు శివుడు వీడు
కంఠాన విషములున్న మనసంత మంచి వెన్న
ఏనాటి నోము పండి నీకంఠము పట్టినాడే
శ్రీశైల వాస కళ్యాణం కనరండి నేడు వైభోగం
బ్రమరాంబ విభుని కళ్యాణం శ్రీశైల మంత సింగారం
4. మెడలోన నాగరాజు – మరుమల్లె మాల కాగా
శిగలోన చందమామ నగరాజు తనము కాము
ఊరేగె పెళ్ళికొడుకై – వయ్యారి చెలువ కొరకై
శ్రీశైల వాస కళ్యాణం కనరండి నేడు వైభోగం
బ్రమరాంబ విభుని కళ్యాణం శ్రీశైల మంత సింగారం