శ్రీ రామ నామం మనకెంతో మధురం - హనుమాన్ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

శ్రీ రామ నామం మనకెంతో మధురం
చిన్నబోయున్నాము మారుతి
నీవు చిరునవ్వు నవ్వరాదా మారుతీ || 2 ||

కొండంత ఆశ తోటీ
నీకొండకే వచ్చినాము || 2 ||
తల్లి తండ్రుల విడచీ
నీవు తండ్రివని వచ్చినామయ్యా || 2 ||
నీ గుడితలుపు తీయరాదా
నీవడిలోకి చేర్చుకోవా || 2 ||
నీ గుడితలుపు తియ్యరాదా
ఒడిలోకి చేర్చుకోవా
ఓదార్చి ఆదుకోవా

శ్రీ రామ నామం మనకెంతో మధురం
చిన్నబోయున్నాము మారుతి
నీవు చిరునవ్వు నవ్వరాదా మారుతీ

దారిలేని జీవితాలకు
నీవు దారిచూపి బ్రోవరాదా || 2 ||
పండూ వెన్నెల తీరు
జన్మ పావనము చేయరాదా || 2 ||
మా పాపాలు పోవాలని
నీ పాదాలు కడిగేమయా || 2 ||
మా పాపాలు పోవాలని
పాదాలు కడిగేము
పవనాసుత పాలించుమా

శ్రీ రామ నామం మనకెంతో మధురం
చిన్నబోయున్నాము మారుతి
నీవు చిరునవ్వు నవ్వరాదా మారుతీ

చెంతగా తోడుండీ
మా తంటాలు బాపరాదా || 2 ||
మా పిల్లాపాపలనూ
నీవు చల్లంగా చూడరాదా || 2 ||
కొండగట్టు ఆంజనేయా
మా అండదండ నీవేనయ్యా || 2 ||
కొండగట్టు ఆంజనేయా
అండదండ నీవయ్యా
గండాలు బాపరాదా

శ్రీ రామ నామం మనకెంతో మధురం
చిన్నబోయున్నాము మారుతి
నీవు చిరునవ్వు నవ్వరాదా మారుతీ || 2 ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat