10. నవరాత్రులు - శరన్నవరాత్రులు - శ్రీ మహిషాసుర మర్ధని దేవి - Mahishasura Mardini - Navaratri festival
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

10. నవరాత్రులు - శరన్నవరాత్రులు - శ్రీ మహిషాసుర మర్ధని దేవి - Mahishasura Mardini - Navaratri festival

P Madhav Kumar


అమ్మవారు మహిషాసుర మర్ధని దేవిగా దర్శనమిస్తారు.


ఈరోజు అమ్మవారి అలంకారం మహిమాన్వితమైన మహిషాసుర మర్దనీ దేవి అవతారం. అమ్మవారు ఉగ్రరూపంతో, చేతిలో త్రిశూలంతో సింహవాహినియై దుష్టశిక్షణ గావిస్తూ ఉంటుంది.

మహిషాసురుడనే రాక్షసుడు శివుని దగ్గర అమరత్వాన్ని వరంగా పొంది, ఇంద్రుడిని ఓడించి, దేవతకు కూడా హాని తలపెట్టడంతో అందరూ శివకేశవుల దగ్గరకు వెళ్ళి రక్షించమని వేడుకుంటారు. సమస్త దేవతల నుండి శక్తి వెలువడి, ప్రత్యేకమైన ఉగ్రమూర్తిగా రూపొంది, మహిషాసురుని యుద్ధానికి ప్రేరేపించి దుష్టశక్తిని అణచదలచింది. అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి దాకా పోరు సలిపి, ఆశ్వయుజ శుక్ల నవమి దినమున ఆ రాక్షసుని అంతమొందించి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించింది. కొన్ని ప్రాంతాలలో అమ్మవారిని ఈరోజు సిద్ధి ధాత్రిగా పూజిస్తారు.

దుర్గామాత తొమ్మిదో శక్తిరూపం సిద్ధిధాత్రి. ఈమె సర్వసిద్ధులను ప్రసాదించే శక్తి అవతారం. పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ దేవి కృపతోనే పొందినట్లుగా దేవీ పురాణంలో ఉంది. ఈరోజున త్రిరాత్ర వ్రతం కొనసాగిస్తారు. బొమ్మలకొలువు పేరంటం జరుపుతారు. కొన్ని ప్రాంతాలవారు వాహన పూజ మహానవమినాడు చేసుకుంటారని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పరమేశ్వరిని మహిషాసుర మర్ధని అవతారంలో అనేక విధాలుగా పూజించి, జయ జయహే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధని శైలసుతే...అని కొలుస్తారు. ఉగ్రమూర్తిగా ఉన్న అమ్మవారికి వడపప్పు, పానకం, చలిమిడి, పులిహోర, పులగాన్నం, గారెలు, నిమ్మరసం నివేదన చేసి శాంతింపచేస్తారు. మహిషాసుర మర్ధిని స్తోత్రం, లలితాసహస్రనామ స్తోత్రంతో షోడశోపచార పూజలు చేసి అమ్మవారి కరుణాకటాక్షాలు పొందాలని ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈరోజు ధరించవలసిన వర్ణం కాఫీ రంగు.


♦️మహర్నవమి - మహిషాసుర మర్దిని విశిష్టత:

🙏 *మహర్నవమి ....!!*


🌻🌻🌻🌻🌻🌻🌻🌻

మహిషాసుర సంహారం,అంత సామాన్యం కాదు, మహిషాసురుడు గొప్ప రాక్షసుడు, గొప్ప బలవంతుడు. తన తపః శక్తితో ఎన్నో వరాలు పొందాడు, అతనికున్న వర మహిమ అతన్ని మరింత బలవంతునిగా చేసింది. 

ఆ బలగర్వంతో మూడు లోకాలను జయించి విజయ గర్వంతో తన ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించసాగాడు. దేవతలను, ఋషులను, మానవులను కౄరంగా హింసించ సాగాడు. ఏమీ చేయలేక, భయంతో-బాధతో, మునులు, దేవతలు, మానవులు త్రిమూర్తులను ( బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ) రక్షణ కల్పించమని వేడుకున్నారు.

దేవత, ముని, మానవుల వేడుకోలుకు త్రిమూర్తులు కరిగిపోయారు. మహిషాసురుని మీద విపరీతమైన కోపం వచ్చింది.  ఆ కోపం నుంచి ఓ తేజస్సు ( అంటే ఒక వెలుగు – ఒక శక్తి అని అర్ధం ) పుట్టింది. 

దానికి ఒక రూపం ఏర్పడింది, ఆ తరువాత మూడుకోట్ల దేవతల కోపము, ఆవేశము ఈ తేజో రూపంతో కలిసి మరింత శక్తివంతమైన రూపంగా – అదే “ఆదిశక్తి” గా, ”అమ్మ ”గా, స్త్రీ మూర్తిగా ఉద్భవించింది.

ఆమే జగన్మాత అయిన ఆది పరాశక్తి,  ఈ రూపాన్నే ”సర్వదేవతా స్వరూపం” అంటారు...

దేవతలందరూ తమతమ శక్తిని, ఆయుధాలను – ” అమ్మ ” కు యిచ్చారు. శివుడు తన త్రిశూలాన్ని, శ్రీమహావిష్ణువు తన చక్రాన్ని, విశ్వకర్మ (ఈయన ఒక దేవత) ఒక పదునైన గొడ్డలిని ( పరశురాముని), ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని, వాయుదేవుడు ధనుర్బాణాలను ఆ ఆదిపరాశక్తికి ఆయుధాలుగా యిచ్చారు. 

హిమవంతుడు సింహాన్ని ”తల్లి” కి వాహనంగా సమర్పించాడు, సింహాన్ని వాహనంగా చేసుకొని పైన చెప్పిన ఆయుధాలను తీసుకొని వరుణుడు యిచ్చిన శంఖాన్ని పూరించింది.
ఆ శంఖ నాదశక్తికి తట్టుకోలేక రాక్షసులు తలక్రిందులయ్యారు,
మహిషాసురుడును “అణిమాది అష్టసిద్ధుల” సహాయంతో సింహరూపంలో ” దేవి ” ముందు యుద్ధానికి సిద్ధపడ్డాడు. 

ఖడ్గం, కత్తి చేపట్టి మానవ రూపంలోనూ యుద్ధం చేశాడు, మత్తగజంలా (బలమైన ఏనుగలా ) మారి ”అమ్మ ” ను ముట్టడించబోయాడు. చివరకు తన సహజ రూపమైన దున్నపోతు (అంటే మహిషం ) రూపంలో వాడి కొమ్ములతో  ”అమ్మ ” మీద దాడి చేశాడు. 

తన త్రిశూలంతో మహిషాసురుడి గుండెలు చీల్చిపారేసింది ఆ జగదాంబ. రాక్షసుడు చచ్చిపోయాడు, ఇది మహిషాసుర సంహార కథ.

1) చండ
2) ముండ
3) శుంభ
4) నిశుంభ
5) దుర్గమాసుర
6) మహిషాసురులు

ఆరుగురు రాక్షసులు – రజో, తమో గుణాలకు ప్రతీకలు. సత్వ గుణానికి అధిదేవత అయిన జగన్మాత ఈ ఆరుగురు రాక్షసుల్ని సంహరించింది.

రజో, తమో గుణాల పైన సత్వ గుణము యొక్క విజయానికి ప్రతీక ఈ జగన్మాత విజయము. మహిషాసురమర్ధిని అమ్మవారు నవరాత్రులు తొమ్మిది అవతారాలలో దర్శనము ఇచ్చారు.

అమ్మ దుష్ట శిక్షణకు త్రిమూర్తుల శక్తీ తో సహస్ర బాహువులతో సకలాభారనాలతో మహిషాసురుని వధించుటకు అమ్మ ఉగ్ర రూపము ధరించారు. అప్పుడు మహిశాసురుడును చంపివేసినది, అప్పుడు ఆమె రౌద్ర రూపాన్ని చూసి దేవతలు అందరు అమెను స్తుతించారు.

అలానే శంకారాచార్యులవారు మహిషాసుర మర్ధిని స్తోత్రాన్ని పాడారు అది మంచిగా గుర్తింపు ఉన్న పాట., 
నవరాత్రుల తరువాత ఈరొజు మహిషాసుర మర్ధిని స్తోత్రము చదువుతారు.

ఇది అమ్మవారి అతి ఉగ్రమైన రూపం, అశ్వయుజశుద్ధ నవమి నాడు అమ్మవారు మహిషాసురమర్ధినిగా అవతరించి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసింది.

ధర్మ విజయానికి సంకేతంగా అశ్వయుజ శుద్ధనవమినే “మహార్నవమి” గా భక్తులు ఉత్సవం జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించి, అమ్మ సకల దేవతల అంశలతో మహా శక్తిగా ఈ రోజు దర్శనం ఇస్తుంది.

మహిషాసురుడనే రాక్షసుడిని వధించిన అమ్మను ఈ దినాన పూజిస్తే శత్రుభయం తొలగి సకల విజయాలు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకలదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. 

ఈ రోజున ప్రత్యేకంగా చండీ సప్తశతి హోమం చేస్తారు. 
అమ్మవారికి 
*"ఓం ఐం హ్రీం శ్రీం* 
*సర్వసమ్మోహినైస్వాహా”* 
అనే మంత్రాన్ని జపించడం మంచిది అని పురాణాల ద్వారా తెలియుచున్నది..

.....స్వస్తి.

🌺🌺🌺🌺🌺🌺🌺🌺.   

🌻చదువుకోవలసిన స్తోత్రాలు:


మహిషాసుర మర్దిని అష్టోత్తరం, సహస్ర నామావళి,  కాళీ కవచం,  కాళీ అష్టకం, (మహాకవి కాళిదాసు రచించిన..) కాళీ శతనామస్తోత్రం,  కాళీ స్తోత్రం (ఋషులు, దేవతలు రచించిన..) కాళీ సహస్రనామ స్తోత్రం, ( 'క' కార కాళీ కాదు..) మహిషాసుర మర్దిని స్తోత్రం (అయిగిరి నందిని..) పారాయణ చేసుకోవాలి.   ఈ రోజు లలితా సహస్రనామాల్లోని "అపర్ణా చండికా చండముండాసుర నిషూదిని" శ్లోకాన్ని పారాయణ చేసుకోవాలి.  "ఓం శ్రీ మహిషాసురమర్ధిని దేవతాయై నమః" అనే నామాన్ని జపించుకోవచ్చు.  మహిషాసుర మర్దిని గాయత్రి మంత్రం "ఓం మహిషాసురమర్ధిని రూపాయ విద్మహే! పరమాత్మికాయై ధీమహి తన్నో పూర్ణః ప్రచోదయాత్" అనే మంత్రాన్ని జపించుకోవాలి.

🌻మహిషాసురమర్దిని చరిత్ర:


మహిషాసురుడు గొప్ప రాక్షసుడు, గొప్ప బలవంతుడు. తన తపః శక్తితో ఎన్నో వరాలు పొందాడు, అతనికున్న వర మహిమ అతన్ని మరింత బలవంతునిగా చేసింది. 

ఇంద్రాది దేవతలు మహిషాసురుడి వల్ల అనేక కష్టాలు అనుభవించారు. అప్పుడే ఇంద్రాది దేవతలు తమ తమ శరీరాల్లోని దివ్యతేజస్సు లన్నింటిని బయటికి తీసుకొచ్చి,  ఆ తేజస్సుకి ఒక రూపాన్నిచ్చారు. ఆ మూర్తి యొక్క రూపమే మహిషాసురమర్దిని. ఆ తేజోమూర్తికి తమ ఆయుధాలను సమర్పించారు. తండ్రిగారైన హిమవంతుడు ఒక సింహాన్ని సమర్పించాడు. మహిషాసురుడి సేనాధిపతులైన చిక్షిలుడు, చామరుడు, ఉదదృడు, బాష్కలుడు, విడాలుడు అనే సైన్యాధ్యక్షులందరిని సంహరించి,  చివరగా దుర్గాదేవి అష్ట భుజాలతో, సింహవాహినిగా మహిషాసురుణ్ణి  సంహరించింది. దుర్గాదేవి శార్దూల వాహినిగా (పులి) దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించింది..

ఈ శరన్నవరాత్రులలో మహిషాసుర మర్దిని అవతారం,  సింహవాహనం మీద ఆలీడా పాదపద్ధతిలో, ఒక చేతిలో త్రిశూలాన్ని ధరించి, మహిషాసురుడిని సంహరిస్తున్న రూపంలో దర్శనమిస్తుంది. 

శ్రీశైలంలో అమ్మవారు సిద్ధిధాత్రిగా దర్శనమిస్తుంది. ఈ తల్లి సర్వ సిద్ధులను ప్రసాదిస్తుంది. పరమేశ్వరుడు సర్వసిద్ధులను దేవికృప వల్లనే పొందాడని దేవీపురాణంలో ఉంటుంది. ఈ తల్లి శివుని పతిగా పొందడమే కాక!  తన శరీరంలోని అర్ధభాగాన్ని ఆ పరమేశ్వరుడుకిచ్చి "అర్ధనారీశ్వరిగా" అవతరించింది. ఈ తల్లి చతుర్భుజి,  సింహవాహిని.  కుడివైపు చేతిలో చక్రం, గద ధరిస్తుంది. ఎడమచేతిలో శంఖాన్ని, కమలాన్ని ధరిస్తుంది. ఈ తల్లి కమలం మీద కూర్చొని ఉంటుంది.

ఈమెని ఆరాధించేవారికి సర్వ సిద్ధులు కరతలామలకం.   ఈమె కృపచేతనే భక్తుల--, సాధకుల--,  లౌకిక, పారమార్థిక, మనోరథాలు తీరతాయి.   ఈ తల్లి కృపకు పాత్రుడైన భక్తుడికిగానీ, ఉపాసకుడుకి గాని కోరికలు ఏవి మిగలవు? (కుంతీదేవి కోరికలు లేని స్థితిని,  కష్టాలనే ప్రసాదించమని శ్రీకృష్ణుని అర్థించింది.. ఎందుకంటే!! కష్టాల్లోనే భగవంతుడు చెంతనే ఉంటాడు కనుక...) అలాంటివారికి అమ్మవారి సన్నిధే సర్వసోపానం.   

ఈ అమ్మవారి స్మరణ,  ధ్యాన, పూజ వల్ల సంసారం నిస్సారమన బోధపడుతుంది. పరమానంద పరమైన అమృత పదాన్ని (మోక్షాన్ని) పొందుతారు.   ఈ తల్లి అణిమాది అష్టసిద్ధులనే కాక మోక్షాన్ని ప్రసాదించేది.   లౌకిక, అలౌకిక, సర్వార్థ సిద్ధులకు అధిష్టాన ధాత్రి... "సిద్ధిధాత్రి".

అలంకరించే చీర రంగు: ముదురు ఎరుపు రంగు చీర
నైవేద్యంగా: చక్రపొంగలి, గారెలు...


🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺

*మహర్నవమి -* ఆయుధ పూజ...!!*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻

దసరా పండుగకు ఒకరోజు ముందు వచ్చే పండుగే ఆయుధ పూజ. 
దేవీ నవరాత్రుల సమయంలో ఈ ఆయుధ పూజకు ఎంతో ప్రత్యేకత ఉంది. 

తరతరాలుగా వస్తోన్న ఈ ఆచారాన్ని హిందువులలో చాలా మంది ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు.

ఈ పవిత్రమైన పర్వదినాన హిందువులలో చాలా మంది తమ పనికి సంబంధించిన వస్తువులన్నింటినీ , ఇతర సామాగ్రిని దుర్గా మాత ముందు ఉంచి పూజలు చేస్తారు...

రైతులు అయితే కొడవలి , నాగలి , వాహనం ఉన్న వారు తమ వాహనాలకు , టైలర్లు తమ కుట్టు మిషన్లకు , చేనేత కార్మికులు మగ్గాలకు , ఫ్యాక్టరీలలో కార్మికులు తమ మిషన్లకు , ఇతర పనిముట్లకు పసుపు , కుంకుమతో అది వాటిని దేవతలతో సమానంగా ఆరాధిస్తారు.

ఇలా ప్రతి సంవత్సరం ఆయుధ పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది. 

అయితే ఈ ఆయుధ పూజను ఎందుకు జరుపుకుంటారు.. 
ఎందుకని దీనికంత ప్రాముఖ్యత ఇస్తారనే విషయాలపై కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. 

ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

🌻 *పాండవుల ఆయుధాలు...*


పురాణాల ప్రకారం పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లడానికి ముందు జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలను భద్రపరిచారు. అర్జునుడు గాండీవంతో పాటు భీమసేనుని గదాయుధానికి యుద్ధానికి వెళ్లడానికి ముందు ప్రత్యేకంగా పూజలు జరిపించారు.

అలా వారు శక్తి స్వరూపిణిని ప్రసన్నం చేసుకుని, పాండవులు యుద్ధానికి సన్నద్ధం అయ్యారని చెబుతుంటారు. మరోవైపు దుర్గతులను నివారించే మహా స్వరూపిణి అమ్మవారైన దుర్గాదేవి దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించిన రోజు అని చెబుతారు.

 పంచప్రక్రుతి మహా స్వరూపాలలో దుర్గాదేవి మొదటిది. బవబంధాల్లో చిక్కుకున్న వ్యక్తులను అమ్మవారు అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మవారిని ఈరోజు స్మరించుకుంటే.. శత్రు బాధలు తొలగిపోతాయని చాలా మంది నమ్మకం.

ఈ మంత్రాన్ని ఆయుధ పూజ రోజున పఠించాలి... 

*‘ఓం దుం దుర్గాయైనమః'* 
అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలొస్తాయి. 
అలాగే లలిత అష్టోత్తరాలు పఠించాలి. 
ఆ తర్వాత ఆయుధ పూజ లేదా అస్త్రపూజలు చేయాలి.

🌻 *బొమ్మల కొలువు..*


ఆయుధ పూజనే కొన్ని ప్రాంతాల్లో అస్త్ర పూజ అంటారు. కేరళ వంటి ప్రాంతాలలో ఆయుధ పూజ సందర్భంగా ప్రత్యేకంగా కొన్ని పోటీలను నిర్వహిస్తుంటారు. 

తమిళనాడులో ఆయుధ పూజ సందర్భంగా సరస్వతీ దేవి పూజను చేస్తారు. 
తమిళ సంప్రదాయంలో ఇదే పూజను *‘గోలు'* అంటారు. 
ఈరోజున ఆ ప్రాంతంలో బొమ్మల కొలువు నిర్వహిస్తారు..

*శ్రీ మహిషాసుర మర్ధని* అష్టోత్తర శతనామావళి*


🌻🌻🌻🌻🌻🌻🌻🌻

ఓం మహత్యై నమః
ఓం చేతనాయై నమః
ఓం మాయాయై నమః
ఓం మహాగౌర్యై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మహోదరాయై నమః
ఓం మహాబుద్ద్యై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాబలాయై నమః
ఓం మహాసుధాయై నమః (10)

ఓం మహానిద్రాయై నమః
ఓం మహాముద్రాయై నమః
ఓం మహోదయాయై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహాభోగ్యాయై నమః
ఓం మహామోహాయై నమః
ఓం మహాజయాయై నమః
ఓం మహాతుష్ట్యై నమః
ఓం మహాలజ్జాయై నమః
ఓం మహాదృత్యై నమః (20)

ఓం మహాఘోరాయై నమః
ఓం మహాదంష్ట్రాయై నమః
ఓం మహాకాంత్యై నమః
ఓం మహా స్మృత్యై నమః
ఓం మహాపద్మాయై నమః
ఓం మహామేధాయై నమః
ఓం మహాభోదాయై నమః
ఓం మహాతపసే నమః
ఓం మహాస్థానాయై నమః
ఓం మహారావాయై నమః (30)

ఓం మహారోషాయై నమః
ఓం మహాయుధాయై నమః
ఓం మహాభందనసంహర్త్ర్యై నమః
ఓం మహాభయవినాశిన్యై నమః
ఓం మహానేత్రాయై నమః
ఓం మహావక్త్రాయై నమః
ఓం మహావక్షసే నమః
ఓం మహాభుజాయై నమః
ఓం మహామహీరూహాయై నమః
ఓం పూర్ణాయై నమః (40)

ఓం మహాచాయాయై నమః
ఓం మహానఘాయై నమః
ఓం మహాశాంత్యై నమః
ఓం మహాశ్వాసాయై నమః
ఓం మహాపర్వతనందిన్యై నమః
ఓం మహాబ్రహ్మమయ్యై నమః
ఓం మాత్రే నమః
ఓం మహాసారాయై నమః
ఓం మహాసురఘ్న్యై నమః
ఓం మహత్యై నమః (50)

ఓం పార్వత్యై నమః
ఓం చర్చితాయై నమః
ఓం శివాయై నమః
ఓం మహాక్షాంత్యై నమః
ఓం మహాభ్రాంత్యై నమః
ఓం మహామంత్రాయై నమః
ఓం మహామాకృత్యై నమః
ఓం మహాకులాయై నమః
ఓం మహాలోలాయై నమః
ఓం మహామాయాయై నమః (60)

ఓం మహాఫలాయై నమః
ఓం మహానీలాయై నమః
ఓం మహాశీలాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం మహాకలాయై నమః
ఓం మహాచిత్రాయై నమః
ఓం మహాసేతవే నమః
ఓం మహాహేతవే నమః
ఓం యశస్విన్యై నమః
ఓం మహావిద్యాయై నమః (70)

ఓం మహాస్త్యాయై నమః
ఓం మహాగత్యై నమః
ఓం మహాసుఖిన్యై నమః
ఓం మహాదుస్వప్ననాశిన్యై నమః
ఓం మహామోక్షకప్రదాయై నమః
ఓం మహాపక్షాయై నమః
ఓం మహాయశస్విన్యై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహావాణ్యై నమః
ఓం మహారోగవినాశిన్యై నమః (80)

ఓం మహాధారాయై నమః
ఓం మహాకారాయై నమః
ఓం మహామార్యై నమః
ఓం ఖేచర్యై నమః
ఓం మహాక్షేమంకర్యై నమః
ఓం మహాక్షమాయై నమః
ఓం మహైశ్వర్యప్రదాయిన్యై నమః
ఓం మహావిషఘ్మ్యై నమః
ఓం విషదాయై నమః
ఓం మహాద్ర్గవినాశిన్యై నమః (90)

ఓం మహావ్ర్షాయై నమః
ఓం మహాతత్త్వాయై నమః
ఓం మహాకైలాసవాసిన్యై నమః
ఓం మహాసుభద్రాయై నమః
ఓం సుభగాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహాసత్యై నమః
ఓం మహాప్రత్యంగిరాయై నమః
ఓం మహానిత్యాయై నమః
ఓం మహాప్రళయకారిణ్యై నమః (100)

ఓం మహాశక్త్యై నమః
ఓం మహామత్యై నమః
ఓం మహామంగళకారిణ్యై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహామాత్రే నమః
ఓం మహాపుత్రాయై నమః
ఓం మహాసురవిమర్ధిన్యై నమః (108)

🌷🌻🌷🌻🌷🌻🌷🌻🌷

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow