ఎక్కడ చూసినా నీవే దుర్గమ్మా సర్వాంతర్యామి నీవే దుర్గమ్మా
శరణం శరణం శ్రీ కనక దుర్గా చల్లని తల్లీ మా కనకదుర్గా
శరణం శరణం శార్వాణి శంభుని రాణి మా జననీ
సర్వేశ్వరివి జగదీశ్వరివి నీవే దుర్గమ్మా
కాదంబరివి కాత్యాయనివి నీవే నోయమ్మా
ఓంకార రూపిణి నీ చరణములే నమ్మితినోయమ్మ
అమ్ముల గన్నా అమ్మవు నీవే ఆదిశక్తివమ్మా
నిరతము నిన్నే కొలిచితిమీ నీకే పూజలు చేసితిమి
శరణం శరణం శార్వాణి శంభుని రాణి మా జననీ
హిమగిరి తనయే శ్రీ లలితేశ్వరి అమ్మా దుర్గమ్మా
సింహవాహినివి త్రిశూల పాణివి నీవేనోయమ్మా
పసుపు కుంకుమతో పాదపూజలు చేసితిమోయమ్మ
అష్ట దిక్కులు నీవై నిలచిన అమ్మవు నీవమ్మా
ఆర్తితొ నిన్నే వేడితిమీ అభయము నీయగ రావమ్మా
శరణం శరణం శార్వాణి శంభుని రాణి మా జననీ
మధురలో వెలసిన మీనాక్షీవి నీవే దుర్గమ్మా
కంచిలో వెలసిన కామాక్షీవి నీవే నోయమ్మా
కాశీలోన విశాలాక్షివి నీవే దుర్గమ్మా
అభయమునిచ్చి దీవించే అమ్మవు నీవమ్మా
దయతో మమ్ము దీవించి దీవెన లీయగ రావమ్మా
శరణం శరణం శార్వాణి శంభుని రాణి మా జననీ