శారదాంబవే సరస్వతీ చక్కని తల్లీ భారతీ
చక్కని వాక్కులు మాకిమ్మా మక్కువ తీరగ మాయమ్మా
సంగీతానికి సారము నీవే - సప్త స్వరముల తల్లివి నీవే
సరిగమలన్నియు పలికించెదవు - సర్వము నిండిన సరస్వతీ
కాళిదాసుని కలమందుంటివి కమ్మని వాక్యాలనిచ్చుచుంటివి
రామలింగ కవి నాలుకనుంటివి రావా తల్లి రంగస్థలికి
పిలచిన పలికే తల్లివి నీవే - భజనలు నేర్పే భారము నీదే
శరణు వేడితి కరుణను చూపుము - చల్లని తల్లీ మాయమ్మా