కళా నిలయమైన తిరుమలా
శిలగ స్వామియున్న కోవెలా
వెలసినాడు వేంకటరమణా భక్త కోటి సన్నుత చరణా
అందమైన హరినారాయణా పిలిచినంత పలికే పావనా
వెంకటాద్రి శిఖరానా ఆనంద నిలయానా
శ్రీనివాస నామానా ఆ జనార్థనా
వెలసియున్న కోవెలా ఆ తిరుమలా
అలరారు స్వామి ఇలా కోటి కాంతులా
గోవింద గోవింద గోవిందయనగానె
మన గోడు వింటాడుతే మన చెంత నుంటాడులే
వకుళ మాత పుత్రుడు వడ్డీ కాసుల దేవుడు
వామనావతారుడు వాసుదేవుడు
కలియుగమునందునా కమలనాభుడు
పద్మావతిని వలచినా దేవదేవుడు
గోవింద గోవింద గోవిందయనగానె
మన గోడు వింటాడుతే మన చెంత నుంటాడులే
వేయి రూపాలతో వేల నామాలతో
వెలుగుచున్న దేవుడు - వేంకటేశుడు
ఆపదలు తీరే శ్రీ అనంతుడు
వేదనలు బాపే వేదాంతుడు
గోవింద గోవింద గోవిందయనగానె
మన గోడు వింటాడుతే మన చెంత నుంటాడులే