పల్లవి :
శ్రీ లక్ష్మి నరసింహా - మము కాపాడుమా దేవా.. ఆ...
శ్రీ లక్ష్మి నరసింహా - మము కాపాడుమా దేవా ఆ...
|| శ్రీ ||
చరణం 1:
సింహాచలేశ్వర నీ సేవచేయగ నీ దరిని చేరామురా
చరణాలు వేడి నీ శరణుకోరి నిను భక్తి వేడాము వేవేగరా
|| శ్రీ ||
చరణం 2:
తులసీ దళాలు సంపెంగ పూలతో నీ పూజ చేసామురా
సిరి చందనాల గంధాలు పూసి మనసారbనిను కొలువ వరమీయరా
|| శ్రీ ||
చరణం 3:
ప్రహ్లాద వరదా ఓ భక్త మందార దీనులము కరుణించరా
పరమాత్మ పలుక అలుకేలనయ్యా మమ్ములను పాలింప రావేమిరా
|| శ్రీ ||
చరణం 4:
నీ నామ స్మరణం మధురాతి మధురం పొడగను భాగ్యమురా
నీ పుణ్య పాదం తాకినను చాలు శుభచరణ మా జన్మ తరియించురా
|| శ్రీ ||
చరణం 5:
దేవాది దేవా దివ్య ప్రభావా మాతోడు నీడవురా
దివిజేంద్ర వంద్యా ధర నుంటినయ్యా అప్పన్న దాసుడను నన్నేలరా
|| శ్రీ ||